Minister Harish Rao : కాంగ్రెస్‌లో కుర్చీల కోసం కొట్లాట .. మోసాలు,దగాలే వారి నైజం : హరీశ్ రావు

కాంగ్రెస్ పార్టీలో కుర్చీల కోసం కొట్లాడుకుంటున్నారు అంటూ ఎద్దేవా చేశారు మంత్రి హరీశ్ రావు. కేసీఆర్ పాలనలో అభివృద్ధి చేయటానికి కృషి చేస్తున్నారన్నారు.

Minister Harish Rao : కాంగ్రెస్‌లో కుర్చీల కోసం కొట్లాట .. మోసాలు,దగాలే వారి నైజం : హరీశ్ రావు

Minister Harish Rao

Updated On : October 28, 2023 / 4:01 PM IST

BRS Minister Harish Rao : సొంత రాష్ట్రం సాధించటంలోను..సాధించుకున్న రాష్ట్రాన్ని అభివృద్దిలో దూసుకుపోయేలా చేయటంలోను అవిరణ కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ ను మరోసారి సీఎంను చేయాలని మంత్రి హరీశ్ రావు పులుపునిచ్చారు. ఆదిలాబాద్ లోని ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న హరీశ్ రావు మాట్లాడుతు.. నిరాహార దీక్షతో ప్రాణాల్ని పణంగా పెట్టి రాష్ట్రాన్ని సాధించిన సీఎం కేసీఆర్ ప్రభుత్వంలో తెలంగాణ పురోగతి దిగా పరుగులు తీస్తోందని ఈ పదేళ్ల పాలనలో కరవు అనేదేలేదన్నారు. రాష్ట్రంలో కరవు, కర్ఫ్యులు లేవన్నారు. చావు నోట్లో తలపెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ప్రజల కల నెరవేర్చిన గొప్ప మనిషి కేసీఆర్ అని అటువంటి వ్యక్తిని మరోసారి గెలిపించాలన్నారు.తాము అధికారంలోకి రాగానే రూ.400లకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని..రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు. బీజేపీ డకౌట్ ఖాయం, కాంగ్రెస్ రనౌట్ కేసీఆర్ సెంచరీ ఖాయం అంటూ ధీమా వ్యక్తంచేశారు.

కాంగ్రెస్ పార్టీలో కుర్చీల కోసం కొట్లాడుకుంటున్నారు అంటూ ఎద్దేవా చేశారు. కానీ కేసీఆర్ పాలనలో అభివృద్ధి చేయటానికి కృషి చేస్తున్నారన్నారు. పెన్షన్ రూ.2వేలు ఇచ్చినా కళ్యాణ్ లక్ష్మి పథకం ఏర్పాటుతో ఆడబిడ్డలకు వివాహానికి అండగా నిలిచిన గొప్ప పథకాల సృష్టికర్త కేసీఆర్ అని అన్నారు. ఇంటింటికి నల్లా ద్వారా మంచినీరు..రైతులకు సాగునీరు ఇచ్చిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనన్నారు. 24గంటల కరెంట్ ఇస్తు సాగుకు అండగా నిలిచిన రైతుల పక్షపాతి కేసీఆర్ అని అన్నారు.

Minister KTR : తెలంగాణలో కరవు లేదు, కర్ఫ్యు లేదు అభివృద్ధే ఉంది : మంత్రి కేటీఆర్

ఆడబిడ్డల కాన్పుల కోసం కేసీఆర్ కిట్ ద్వారా న్యూట్రీషియన్ కిట్ ద్వారా తల్లీ బిడ్డలకు ఆరోగ్య భరోసాలిచ్చామని..ఇలా చెప్పుకుంటు పోతే తెలంగాణలో అభివృద్ది అంతా ఇంతా కాదన్నారు. దేశంలో అభివృద్ధిలో దూసుకుపోతున్న రాష్ట్రం తెలంగాణ అన్నారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు పార్టీలన్నీ కుట్రలు చేస్తున్నాయని కానీ తెలంగాణలో బీఆర్ఎస్ గాలి వీస్తోందని మరోసారి అధికారంలోకి రావటం ఖాయమన్నారు. బీఆర్ఎస్ కు మరోసారి అధికారాన్ని ఇచ్చి హ్యాట్రిక్ ద్వారా మరింత అభివృద్ధికి అవకాశమివ్వాలని మంత్రి హరీశ్ రావు ఈ సందర్భంగా ప్రజలకు పిలుపునిచ్చారు. మోసాలు, దగాలు కాంగ్రెస్ నైజం అంటూ విమర్శిచారు. అటువంటి కాంగ్రెస్ ను ఓడించి మరోసారి తెలంగాణ అభివృద్ధికి పాటు పడుతున్న బీఆర్ఎస్ ను గెలిపించాలని కోరారు.