VarunLav : వరుణ్, లావణ్య వివాహానికి నాగచైతన్య, సమంత..

వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్ళికి నాగచైతన్య, సమంత, రష్మిక మందన్న కూడా వెళ్ళబోతున్నారట. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ గా మారింది.

VarunLav : వరుణ్, లావణ్య వివాహానికి నాగచైతన్య, సమంత..

Naga Chaitanya Samantha went to Varun Tej Lavanya Tripathi news viral

Updated On : October 31, 2023 / 8:55 PM IST

VarunLav : వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఇటలీలో ఘనంగా జరుగుతున్నాయి. నిన్న అక్టోబర్ 30 రాత్రి సంగీత్, కాక్ టైల్ పార్టీ జరిగింది. ఈరోజు ఉదయం హల్దీ వేడుక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాలకు సంబంధించిన ఫోటోలు లీక్ అవుతూ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈరోజు రాత్రి మెహందీ వేడుక నిర్వహించనున్నారు. నవంబర్ 1న మధ్యాహ్నం 2 గంటల 48 నిమిషాల ముహూర్తంకు వరుణ్ లావణ్య వివాహ బంధంతో ఒక్కటవ్వనున్నారు.

ఇక ఈ వివాహానికి మెగా, అల్లు, కామినేని, లావణ్య ఫ్యామిలీలు, పలువురు సన్నిహితులు హాజరయ్యారు. అలాగే సినీ పరిశ్రమ నుంచి కూడా కొందరు హాజరు కాబోతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే నితిన్ తన భార్యతో కలిసి అక్కడ సందడి చేస్తున్నాడు. ఫ్యాషన్ డిజైనర్ నీరజ కోనతో పాటు మరికొందరు ఇండస్ట్రీ స్టార్స్ కూడా హాజరయ్యినట్లు సమాచారం. కాగా ఈ పెళ్ళికి నాగచైతన్య, సమంత, రష్మిక మందన్న కూడా వెళ్ళబోతున్నారట. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ గా మారింది.

Also read : VarunLav : వరుణ్, లావణ్య హల్దీ వేడుక పిక్స్ వైరల్.. పవన్ కళ్యాణ్ అభిమానుల బాధ..

చైతన్య, సామ్ విడాకులు తీసుకున్న తరువాత మళ్ళీ కలిసి ఒక వేదిక పై కనిపించలేదు. ఇప్పుడు ఈ పెళ్లి కోసం వీరిద్దరూ అక్కడికి రాబోతున్నారని తెలియడంతో అందరిలో క్యూరియోసిటీ క్రియేట్ అవుతుంది. మరి ఈ వార్తలో ఎంత నిజముందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే. ఇక రేపు మధ్యాహ్నం వివాహం పూర్తి అయిన రాత్రి అక్కడే రిసెప్షన్ కూడా నిర్వహించనున్నారు. ఇటలీ నుంచి హైదరాబాద్ కి తిరిగి వచ్చాక నవంబర్ 5న ఫ్రెండ్స్, రిలేటివ్స్, ఇండస్ట్రీ పర్సన్స్ కోసం ఇక్కడ రిసెప్షన్ నిర్వహించనున్నారు.