Ishan kishan : ఏం కొట్టుడు కొట్టావ్ బ్రో.. ఇషాన్ కిషన్ విధ్వంసకర శతకం.. వీడియో వైరల్

Ishan kishan : యువ బ్యాటర్ ఇషాన్ కిషన్ బ్యాటుతో అదరగొట్టాడు. ఫోర్లు, సిక్సర్లతో బౌలర్లపై విరుచుకుపడ్డాడు.. కేవలం 45 బంతుల్లోనే సెంచరీ పూర్తి

Ishan kishan : ఏం కొట్టుడు కొట్టావ్ బ్రో.. ఇషాన్ కిషన్ విధ్వంసకర శతకం.. వీడియో వైరల్

Ishan kishan

Updated On : December 19, 2025 / 9:52 AM IST

Ishan kishan : యువ బ్యాటర్ ఇషాన్ కిషన్ బ్యాటుతో అదరగొట్టాడు. ఫోర్లు, సిక్సర్లతో బౌలర్లపై విరుచుకుపడ్డాడు.. కేవలం 45 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు.. ఫలితంగా జార్ఖండ్ జట్టు 69 పరుగుల తేడాతో విజయం సాధించడంలో కీలక భూమి పోషించాడు.

సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీ 2025 (SMAT) ఫైనల్లో జార్ఖండ్ కెప్టెన్ ఇషాన్ కిషన్ అద్భుత బ్యాటింగ్ తో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు. పూణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో హర్యానాతో జరిగిన టైటిల్ మ్యాచ్ లో ఇషాన్ కిషన్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 45 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. 49 బంతుల్లో మొత్తం 101 పరుగులు చేశాడు. ఇందులో 10 సిక్సులు, ఆరు ఫోర్లు ఉన్నాయి. కేవలం బౌండరీల నుంచే 84 పరుగులను ఇషాన్ కిషన్ రాబట్టాడు.