Talasani Srinivas: ఎన్నికలతో డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీకి ఏం సంబంధం?: మంత్రి తలసాని

కొన్ని ప్రాంతాల్లో రూ.30-రూ.50 కోట్ల మధ్య విలువైన భూముల్లో డబుల్ బెడ్రూమ్ ఇండ్లను నిర్మించామని తెలిపారు.

Talasani Srinivas: ఎన్నికలతో డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీకి ఏం సంబంధం?: మంత్రి తలసాని

Talasani Srinivas

Updated On : September 1, 2023 / 5:18 PM IST

Talasani Srinivas – Double Bedroom: ఎన్నికలకు డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీకి సంబంధం లేదని తెలంగాణ (Telangana) మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. అలాగే, ఎలక్షన్ కోడ్‌కు డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీకి కూడా సంబంధం లేదని చెప్పారు. హైదరాబాద్ లోని జీహెచ్ఎంసీ ఆఫీస్ నుంచి ఆయన మీడియాతో మాట్లాడారు.

దేశంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల విధానం ఎక్కడా లేదని తలసాని చెప్పారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీలో రాజకీయ నేతల ప్రమేయం లేదని తెలిపారు. 12 వేలకు ప్రణాళికలు చేస్తే 11,700 ఇండ్లను డ్రా ద్వారా ఎంపిక చేశామని చెప్పారు.

కొన్ని ప్రాంతాల్లో రూ.30-రూ.50 కోట్ల మధ్య విలువైన భూముల్లో డబుల్ బెడ్రూమ్ ఇండ్లను నిర్మించామని తెలిపారు. మరో 15 రోజుల్లో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీ రెండో దశ ప్రారంభం అవుతుందని చెప్పారు. మొత్తం ఆరు దశల్లో ఇండ్ల పంపిణీ జరుగుతుందని వెల్లడించారు.

తాము ఇన్ని మంచి పనులు చేస్తుంటే కొందరు చూడలేకపోతున్నారని విపక్షాలపై మండిపడ్డారు. రేపటి నుంచి పంపిణీ చేసే ఇండ్లను అందరూ చూడాలని అన్నారు. ఇండ్ల కోసం దరఖాస్తులు చేసుకున్న వారిలో అన్ని పార్టీల వారూ ఉన్నారని తెలిపారు. పంపిణీ జరిగిన తరువాతే అసలు నిజాలు తెలుస్తాయని, తాము పేదలకు ఇండ్లు ఇచ్చామో, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు ఇచ్చామో విపక్షాలకు అర్థమవుతుందని అన్నారు.

Ambati Rambabu: కంటికి ఎవరు కనపడ్డా ఆయన పచ్చ కండువా కప్పేస్తున్నారు: మంత్రి అంబటి