Odisha train tragedy : ఒడిశా రైలు ప్రమాదం జరిగి రెండు నెలలు గడచినా…ఇంకా 29మంది మృతదేహాలను గుర్తించలేదు
ఒడిశా రైలు దుర్ఘటన జరిగి రెండు నెలలు గడిచినా ఇంకా 29 మృతదేహాలను గుర్తించలేదు. ఈ మృతదేహాలను భువనేశ్వర్ ఎయిమ్స్‌లోని ఐదు కంటైనర్లలో భద్రపర్చారు. ఈ రైలు ప్రమాదంలో 266 మృతదేహాలను మృతుల బంధువులకు అప్పగించారు.....

Odisha train tragedy
Odisha train tragedy : ఒడిశా రైలు దుర్ఘటన జరిగి రెండు నెలలు గడిచినా ఇంకా 29 మృతదేహాలను గుర్తించలేదు.
ఈ మృతదేహాలను భువనేశ్వర్ ఎయిమ్స్‌లోని ఐదు కంటైనర్లలో భద్రపర్చారు. ఈ రైలు ప్రమాదంలో 266 మృతదేహాలను మృతుల బంధువులకు అప్పగించారు. ఒడిశాలోని బహనాగ బజార్ రైల్వే స్టేషన్‌లో జరిగిన ట్రిపుల్ రైలు ప్రమాదంలో మరణించిన 295 మందిలో, 29 మృతదేహాలు ఇంకా గుర్తింపు కోసం వేచి ఉన్నాయని ఓ అధికారి తెలిపారు. (29 bodies from Odisha train tragedy still unidentified)
జూన్ 2వతేదీన జరిగిన రైలు ప్రమాదం తర్వాత ప్రమాదం జరిగిన ప్రదేశం నుంచి మొత్తం 162 మృతదేహాలను వెలికితీశామని ఎయిమ్స్ భువనేశ్వర్ సూపరింటెండెంట్ ప్రొఫెసర్ దిలీప్ కుమార్ పరిదా చెప్పారు. (Odisha train tragedy) వాటిలో 81 మందిని మొదటి దశలో వారి కుటుంబ సభ్యులకు అందించామని ఆయన పేర్కొన్నారు. డీఎన్ఏ పరీక్ష ఫలితాల ఆధారంగా మరో 52 మృతదేహాలను వారి కుటుంబాలకు అప్పగించారు.
మన ఎమ్మెల్యేల ఆస్తులు చూస్తే షాకవ్వాల్సిందే…ఏడీఆర్,ఎన్ఈడబ్ల్యూ రిపోర్టులో సంచలన వాస్తవాలు
హక్కుదారుల డీఎన్‌ఏతో సరిపోలని మృతదేహాలను నిబంధనల ప్రకారం ఎవరికీ ఇవ్వబోమని ప్రొఫెసర్ దిలీప్ కుమార్ పరిదా చెప్పారు. జార్ఖండ్‌కు చెందిన దినేష్ యాదవ్ (31), బీహార్‌కు చెందిన సురేష్ రే (23) – మృతదేహాలను తీసుకెళ్లడానికి వారి కుటుంబ సభ్యులు విముఖత వ్యక్తం చేయడంతో వారి మృతదేహాలను భువనేశ్వర్ మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగులు దహనం చేశారు.
Seema -Sachin Love Story : సీమాహైదర్‌ను పాక్ తిరిగి పంపిస్తారా? యూపీ సీఎం యోగి ఏమన్నారంటే…
జార్ఖండ్‌లోని దుమ్కా ప్రాంతానికి చెందిన హర్దేవ్ కుమార్ బంధువు కైలాష్ కుమార్ తన డీఎన్ఏ నమూనాను సమర్పించారు. తన సోదరుడి మృతదేహం గుర్తింపు కోసం ఎదురు చూస్తున్నానని హర్దేవ్ కుమార్ చెప్పారు. షాలిమార్ నుంచి చెన్నైకి వెళ్లే కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, బెంగళూరు-హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, ఒక గూడ్స్ రైలుతో కూడిన మూడు రైళ్లు ఒకదానికొకటి ఢీకొనడంతో 295 మంది మరణించగా, 1200 మందికి పైగా గాయపడ్డారు.