అతివేగమే కారణమా : దివాకర్ ట్రావెల్స్ బస్సు బోల్తా

దివాకర్ ట్రావెల్ బస్సు పల్టీ కొట్టింది. బస్సులో ఉన్న వారికి తీవ్రగాయాలయ్యాయి. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. వీరిని హైదరాబాద్‌కు తరలించారు. ఈ ఘటన విజయవాడ – హైదరాబాద్ జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. అత్యంత వేగంతో బస్సును నడపడం, డ్రైవర్ నిద్రమత్తులో ఉండడమే కారణమని ప్రయాణికులు అంటున్నారు.
దివాకర్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు సెప్టెంబర్ 25వ తేదీ బుధవారం రాత్రి వైజాగ్ నుంచి హైదరాబాద్‌కు వస్తోంది.
బస్సులో మొత్తం 50 మంది ప్రయాణీకులున్నారు. దురాజ్ పల్లి వద్దకు రాగానే బస్సు అదుపు తప్పిపోయింది. బస్సు పల్టీ కొట్టేసింది. అర్ధరాత్రి కావడంతో అందరూ నిద్రమత్తలో ఉన్నారు. ఏమి జరిగిందో తెలియరాలేదు. ఒకరిపై ఒకరు పడిపోయారు. ఒకరి తలలు పగలగా..మరికొంతమందికి చేతులు, కాళ్లు విరిగిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
బస్సులో ఉన్న వారిని బయటకు తీసుకొచ్చారు. గాయాలైన 10 మందిని సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. వీరిలో రాజమండ్రికి చెందిన ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండడంతో..మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు. డ్రైవర్ ఫాస్ట్‌గా తీసుకొచ్చాడని, నిద్ర మత్తులో ఉన్నాడని ఓ ప్రయాణీకుడు వెల్లడించాడు.
Read More : సీఐ సూర్యనారాయణ ఆత్మహత్య