80 ఏళ్ల ఆచారం : నువ్వుల నూనె త్రాగే మొక్కు తీరింది

సంప్రదాయాలను అనుసరించటంలోను..వాటిని అమలు చేయటంలోను..వాటిని పాటింటచటంలోను గిరిజనులు వారికి వారే సాటిగా వుంటారు. ఈ క్రమంలోనే ఆదివాసీ గిరిజనులైన తోడసం వంశస్తుల ఆరాధ్యదైవమైన ఖాందేవ్ జాతరలో ఓ గిరిజన ఆడపడుచు రెండు కిలోల నువ్వుల నూనె తాగి మొక్కు తీర్చుకుంది.  

  • Published By: veegamteam ,Published On : January 23, 2019 / 05:06 AM IST
80 ఏళ్ల ఆచారం : నువ్వుల నూనె త్రాగే మొక్కు తీరింది

Updated On : January 23, 2019 / 5:06 AM IST

సంప్రదాయాలను అనుసరించటంలోను..వాటిని అమలు చేయటంలోను..వాటిని పాటింటచటంలోను గిరిజనులు వారికి వారే సాటిగా వుంటారు. ఈ క్రమంలోనే ఆదివాసీ గిరిజనులైన తోడసం వంశస్తుల ఆరాధ్యదైవమైన ఖాందేవ్ జాతరలో ఓ గిరిజన ఆడపడుచు రెండు కిలోల నువ్వుల నూనె తాగి మొక్కు తీర్చుకుంది.  

నార్నూర్: సంప్రదాయాలను అనుసరించటంలోను..వాటిని అమలు చేయటంలోను..వాటిని పాటింటచటంలోను గిరిజనులు వారికి వారే సాటిగా వుంటారు. అభివద్ది సాధించినా వారి సంప్రదాయాలను మాత్రం పాటిస్తునే వుంటారు. ఈ క్రమంలోనే ఆదివాసీ గిరిజనులైన తోడసం వంశస్తుల ఆరాధ్యదైవమైన ఖాందేవ్ జాతరలో సోమవారం (జనవరి 21)న ఓ గిరిజన ఆడపడుచు రెండు కిలోల నువ్వుల నూనె తాగి మొక్కు తీర్చుకుంది.  

ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండల కేంద్రంలోని గిరిజనులు జాతర జనవరి 20 అర్థరాత్రి ప్రారంభం అయ్యింది. తోడసం వంశానికి చెం దిన ఆడపడుచు నువ్వుల నూనె తాగి మొక్కు తీర్చుకోవడం ఖాందేవ్ జాతరలో ఆనవాయితీగా వస్తోంది. ఈ మొక్కు తీర్చుకోవటం కోసం  వారు నెలరోజుల ముందే నువ్వుల నూనెను ఇంటి వద్దే స్వయంగా తయారు చేస్తారు. ఇంకా  తోడసం వంశంలోని ప్రతి ఇంటి నుంచి పూజకు తీసుకొచ్చిన నువ్వుల నూనెను సేకరిస్తారు.

అలా సేకరించిన నూనెను గంగాపూర్ గ్రామానికి చెందిన తోడసం వంశ ఆడపడుచు కుమ్ర లక్ష్మీబాయి తాగి మొక్కు తీర్చుకుంది. రెండేళ్లుగా నూనె తాగి మొక్కు తీర్చుకుంటున్నానని..సంతాన యోగం, కుటుంబంలో అందరికీ మంచి జరుగుతుందని వారి నమ్ముతామనీ.. ఈ ఏడాదితో తన  మొక్కు తీరిపోతుందని ఆమె తెలిపింది. ఇటువంటి మొక్కుల ఆచారం 80 ఏళ్లుగా వస్తుందని..తోడసం వంశానికి చెందిన ఆడపడుచులు మూడేళ్లకు ఒకరు చొప్పున ఈ నువ్వుల నూనె తాగాల్సి ఉంటుందని ఆలయ పూజారి తోడసం ఖమ్ము పటేల్, తోడసం సోనేరావు తెలిపారు.