అమరావతి.. కూచిపూడి ఐకానిక్‌ బ్రిడ్జిగా నామకరణం

ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధాని శనివారం ఉదయం అమరావతి ఐకానిక్ వంతెనకు శంకుస్థాపన చేశారు. రెండు కీలకమైన ప్రాజెక్టులకు చంద్రబాబు ఇబ్రహీంపట్నం సమీపంలోని పవిత్రసంగమం వద్ద శంకుస్థాపన చేశారు.

  • Published By: sreehari ,Published On : January 12, 2019 / 07:31 AM IST
అమరావతి.. కూచిపూడి ఐకానిక్‌ బ్రిడ్జిగా నామకరణం

ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధాని శనివారం ఉదయం అమరావతి ఐకానిక్ వంతెనకు శంకుస్థాపన చేశారు. రెండు కీలకమైన ప్రాజెక్టులకు చంద్రబాబు ఇబ్రహీంపట్నం సమీపంలోని పవిత్రసంగమం వద్ద శంకుస్థాపన చేశారు.

అమరావతి : ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధాని శనివారం ఉదయం అమరావతి ఐకానిక్ వంతెనకు శంకుస్థాపన చేశారు. రెండు కీలకమైన ప్రాజెక్టులకు చంద్రబాబు ఇబ్రహీంపట్నం సమీపంలోని పవిత్రసంగమం వద్ద శంకుస్థాపన చేశారు. తాగునీటి అవసరాలకు చేపడుతున్న నీటిశుద్ధి ప్లాంట్‌కు కూడా సీఎం భూమిపూజ చేశారు. కూచిపూడి ఐకానిక్‌ బ్రిడ్జిగా నామకరణం చేస్తున్నామని సీఎం ప్రకటించారు. ఐకానిక్ వంతెన శంకుస్థాపన సందర్భంగా ఏపీ సీఎం మాట్లాడుతూ.. పవిత్రసంగమంలో మరో చరిత్రకు శ్రీకారం చుట్టామని అన్నారు. కూచిపూడి మన వారసత్వ సంపద అని, కూచిపూడి నాట్యాన్ని ప్రతిబింబించేలా బ్రిడ్జి నిర్మాణం చేపట్టున్నట్లు తెలిపారు. రాష్ట్రాన్ని టూరిజానికి హబ్‌గా తయారు చేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. విజయవాడను అభివృద్ధపథంలో ముందుకు తీసుకెళ్తామని అన్నారు. అందుకు అందరి సహకారం ఎంతో అవసరమని చెప్పారు. రాష్ట్రంలో పెన్షన్లు రూ. వెయ్యి నుంచి రూ. 2 వేలకు పెంచామని తెలిపారు. 

విజయవాడ-హైదరాబాద్‌ జాతీయ రహదారిని రాజధానితో అనుసంధానిస్తూ కృష్ణా నదిపై రూ.1387 కోట్లతో 3.2కి.మీ.ల పొడవైన ఐకానిక్‌ వంతెనను నిర్మించనున్నారు. దీని మధ్యలో 0.48కి.మీ.ల భాగాన్ని ఐకానిక్‌గా నిర్మిస్తారు. ఇదంతా యోగ భంగిమను పోలి అచ్చం పైలాన్‌ లా ఉంటుంది. వంతెనతో అనుసంధానిస్తూ రెండు పక్కలా తీగల అమరిక ఉంది. ఈ పైలాన్‌ ఎత్తు 170 మీటర్లు. ఆరు వరుసలుగా నిర్మిస్తారు. రెండు పక్కలా 2.5 మీటర్ల వెడల్పు అయిన వాకింగ్ వే ఉంటుంది. నిర్మాణానికి పైల్‌ ఫౌండేషన్‌ వేస్తారు. ఈ వంతెనతో హైదరాబాద్‌, జగదల్‌పూర్‌ జాతీయ రహదారులు అమరావతితో అనుసంధానం కానున్నాయి. తద్వారా 40 కి.మీ.ల దూరంలో విజయవాడలో ట్రాఫిక్‌ సమస్య తగ్గుతుంది. రెండు గంటల ప్రయాణ సమయం కూడా ఆదా అవుతుంది.