అంగారకుడి నుంచి ఊడిపడ్డ 7లక్షల ఏళ్లనాటి ఉల్కను..తిరిగి పంపేస్తున్న నాసా!

  • Published By: nagamani ,Published On : July 28, 2020 / 02:44 PM IST
అంగారకుడి నుంచి ఊడిపడ్డ 7లక్షల ఏళ్లనాటి ఉల్కను..తిరిగి పంపేస్తున్న నాసా!

Updated On : July 28, 2020 / 3:16 PM IST

అంగారకుడి నుంచి ఊడిపడిన ఉల్కను..తిరిగి అక్కడికే పంపింపచేయనుంది అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా..! సుమారు 7లక్షల ఏళ్ల వయసున్న ఒక ఉల్కాశకలం 1999లో ఒమన్ లో భూమిమీద కనుగొనబడింది. ఈ ఉల్కాశకలం ప్రస్తుతం బ్రిటన్ రాజధాని లండన్‌లోని నేచురల్ హిస్టరీ మ్యూజియంలో ఉంది. పర్సెవరెన్స్ రోవర్‌ ద్వారా ఈ ఉల్కాశకలాన్ని అంగారకుడిపైకి పంపనున్నట్లు నాసా సీనియర్ సైంటిస్ట్ తెలిపారు.

‘సే ఆల్ యేమిర్ 008’ అనే ఈ ఉల్కాశకలం సుమారు 6-7లక్షల ఏళ్ల క్రితం అంగారకుడి నుంచి విడిపోయినట్లు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. మార్స్ గ్రహంపై జరిగిన పేలుడు కారణంగా ఈ ఉల్క ఏర్పడిందని, సుమారు వెయ్యి సంవత్సరాల క్రితం భూమిపై పడిందని చెప్పారు.

ఎర్త్ సైన్సెస్ కలెక్షన్స్ హెడ్, మార్స్ 2020 సైన్స్ టీం సభ్యుడు ప్రొఫెసర్ కరోలిన్ స్మిత్ మాట్లాడుతూ..“ప్రతి సంవత్సరం..ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలకు అధ్యయనం చేయడానికి వందలాది ఉల్కల నమూనాలను నాసా నుంచి అందిస్తున్నామనీ..ఈ మార్స్ గ్రహం నుంచి ఊడిపడిన ఈ ఉల్కను తిరిగి మార్స్ మీదకు పంపించేయనున్నామని తెలిపారు. మార్స్ గురించి మరింత జ్ఞానాన్ని పెంచుకోవటానికి ఈ ఉల్క చాలా ఉపయోగపడిందని అన్నారు. నాసా మార్స్ 2020 రోవర్ మిషన్లో భాగంగా దీన్ని తిరిగి మార్స్ పైకి పంపించనున్నట్లుగా తెలిపారు.