కరోనా నిరాశ మధ్య మంచి గుడ్‌న్యూస్: ఏపీలో కొత్తగా ఒకటే పాజిటివ్ కేసు

  • Published By: chvmurthy ,Published On : April 7, 2020 / 07:37 AM IST
కరోనా నిరాశ మధ్య మంచి గుడ్‌న్యూస్:  ఏపీలో కొత్తగా ఒకటే పాజిటివ్ కేసు

Updated On : April 7, 2020 / 7:37 AM IST

కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర  ప్రభుత్వం గట్టిగా కృషి చేస్తోంది.  నిబంధనలు కఠినంగా అమలు చేయటంతో మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. సోమవారం సాయంత్రం 6 గంటల నుంచి మంగళవారం ఉదయం 9 గంటల వరకు 19 మంది అనుమానితులకు  పరీక్షలు నిర్వహించారు. 

వారిలో గుంటూరుకి చెందిన ఒకరికి పాజిటివ్  వచ్చింది. గత 15 గంటల్లో రాష్ట్రంలో కేవలం ఒక్క కరోనా కేసు మాత్రమే పాజిటివ్‌గా తేలిసింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 304​కి చేరింది. 

ఇక జిల్లాల వారిగా ఇప్పటి వరకు  అత్యధికంగా కర్నూలులో 74 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, నెల్లూరులో 42, గుంటూరు 33, కృష్ణా 29, వైఎస్సార్‌ జిల్లాలో 27,  విశాఖపట్నం 20, పశ్చిమ గోదావరి 21, చిత్తూరు 17, తూర్పు గోదావరి 11,  ప్రకాశం 24,  అనంతపురంలో 6 కేసులు నమోదు అయ్యాయి. ఈ మేరకు మంగళవారం ఉదయం 11 గంటల వరకు ఉన్న పరిస్ధితిపై  రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్‌ బులిటిన్‌ను విడుదల చేసింది.

ap corona status 11 am