తెలంగాణలో ఆత్మహత్య చేసుకున్న ఇంటర్ విద్యార్ధి

  • Published By: vamsi ,Published On : April 23, 2019 / 03:33 PM IST
తెలంగాణలో ఆత్మహత్య చేసుకున్న ఇంటర్ విద్యార్ధి

Updated On : April 23, 2019 / 3:33 PM IST

ఇంటర్ పరిక్ష ఫలితాల విషయంలో, మార్కుల జాబితాలో అవకతవకలపై తెలంగాణ వ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తం అవుతున్న క్రమంలో మరో ఇంటర్ విద్యార్ధి ఆత్మహత్య చేసుకోవడం వరంగల్ జిల్లాలో ఆందోళనలకు దారితీసింది. వరంగల్ జిల్లా నెక్కొండ మండలంలోని రెడ్లవాడ గ్రామానికి చెందిన నవీన్ అనే విద్యార్ధి మంగళవారం(23 ఏప్రిల్ 2019) రైలు క్రింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.

నెక్కొండలోని గాయత్రి ఇంటర్ కాలేజీలో ఫస్ట్ ఇయర్0 పరీక్షలు రాసిన నవీన్.. ఇటీవల విడుదలైన ఫలితాలలో అన్నీ సబ్జెక్టులు ఫెయిల్ కావడంతో..  మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికంగా ఉన్న రైల్వే ట్రాక్ దగ్గరికి వెళ్లి రైలు క్రింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. కుమారుడు మృతి చెందిన విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు మృతదేహం వద్దకు చేరుకుని విలపిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ధర్యాప్తు చేపట్టారు. కాగా నవీన్ మృతి పట్ల స్థానిక విద్యార్ధి నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

.