కర్నూలుకు బాబు : టీడీపీలోకి కోట్ల దంపతులు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోని వేదవతి, గుండ్రేవుల సాగునీరు ప్రాజెక్టులకు మార్చి 02వ తేదీ శనివారం బాబు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం కోడుమూరులో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ సభలోనే కేంద్రమాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి దంపతులు టీడీపీలో చేరనున్నారు. కోడుమూరు బహిరంగ సభకు తన అనుచర వర్గాన్ని కోట్ల భారీగా తరలిస్తున్నారు. లక్షమంది టార్గెట్‌గా సభకు సమీకరణ చేస్తున్నారు.
Read Also : జగన్ అనే నేను : చనిపోయాకా బతికుండాలి.. అందుకే సీఎం కావాలి
ఫిబ్రవరి 27 బుధవారం కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, కోట్ల సుజాతమ్మ కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. పార్టీని నమ్ముకుని పని చేసిన తమ కుటుంబానికి గుర్తింపు దక్కలేదని కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి వాపోయారు. ఆరు దశాబ్ధాలుగా కాంగ్రెస్ లోనే ఉన్నామని..పార్టీని బతికించుకోవాలని చాలా ప్రయత్నించామన్నారు. జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారని తెలిపారు. చంద్రబాబు హామీ మేరకే టీడీపీలో చేరుతున్ననట్లు ప్రకటించారు.