వన మహోత్సవం : గుంటూరుకు సీఎం జగన్

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు. మేడికొండూరు మండలం డోకిపర్రు గ్రామంలో 2019, ఆగస్టు 31వ తేదీ శనివారం జరిగే 70వ వన మహోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. వన మహోత్సవంలో భాగంగా సీఎం జగన్ స్వయంగా మొక్కలు నాటనున్నారు. ఈ సందర్భంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రదర్శనశాలను ఆయన ప్రారంభిస్తారు.
అనంతరం జరిగే బహిరంగ సభలో సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రసంగిస్తారు. రాష్ట్ర మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, పేర్ని నాని, మేకతోటి సుచరిత, మోపిదేవి వెంకటరమణతో పాటు గుంటూరు జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు సభలో పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి సంబంధించి అధికారులు, పోలీసులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. తాడేపల్లి నివాసం నుంచి నేరుగా అమీనాబాద్‌కు సీఎం జగన్ చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో డోకిపర్రుకు వెళుతారు. కార్యక్రమం అనంతరం నేరుగా తాడేపల్లికి చేరుకుంటారు.
Read More : పవన్ కళ్యాణ్‌కు అభిమాని చెప్పులు గిఫ్ట్