ఉత్తమ ఉపాధ్యాయులు వీళ్లే: ప్రకటించిన ఏపీ ప్రభుత్వం

  • Published By: vamsi ,Published On : September 3, 2019 / 03:20 PM IST
ఉత్తమ ఉపాధ్యాయులు వీళ్లే: ప్రకటించిన ఏపీ ప్రభుత్వం

Updated On : September 3, 2019 / 3:20 PM IST

ప్రతీ ఏడాది ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇచ్చే ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులను జగన్ ప్రభుత్వం కూడా ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలకు సంబంధించి ఉత్తమ ఉపాధ్యాయుల పేర్లను వెల్లడించింది.  2019 ఏడాదికి గానూ 13 మందిని ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక చేసింది ప్రభుత్వం. ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపిక కోసం ఏర్పాటు చేసిన కమిటీ ప్రక్రియను పూర్తిచేసి ఉత్తమ ఉపాధ్యాయుల పేర్లను వెల్లడించింది.

ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారిలో శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ జీవీ జగన్నాథరావు, విజయనగరం జిల్లా డెంకాడ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల అధ్యాపకులు ఏ గౌరీప్రసాద్‌, విశాఖ జిల్లా ఎల్‌బీ జూనియర్‌ కళాశాల అధ్యాపకురాలు ఈ నిర్మల, తూర్పు గోదావరి జిల్లా వీటీ జూనియర్‌ కళాశాల అధ్యాపకులు వై ప్రభాకర్‌రావు, పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు ఎంఆర్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ వి కేశవప్రసాద్‌ ఉన్నారు.

అలాగే కృష్ణా జిల్లా దుర్గామల్లేశ్వర మహిళా జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ ఎస్‌ పద్మజ, గుంటూరు జిల్లా పెనుమాక ప్రభుత్వ జూనియర్‌ కళాశాల అధ్యాపకులు ఆర్‌ వీరభద్రరావు, ప్రకాశం జిల్లా టంగుటూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకులు కే రాజశేఖర్, నెల్లూరు జిల్లా వెంకటాచలం ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకురాలు ఎం విజయలక్ష్మి ఉన్నారు.

ఇక రాయలసీమ నుంచి చిత్తూరు జిల్లా వాయల్పాడు ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకులు ఎం.రాధాకృష్ణ, కడప జిల్లా రాయచోటి ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకులు టి నర్సింహారెడ్డి, కర్నూలు జిల్లా సెయింట్ జోసఫ్ జూనియర్ కళాశాల అధ్యాపకురాలు బి వెంకటలక్ష్మి, అనంతపురం జిల్లా ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ వై ప్రశాంతి పేర్లు ఉన్నాయి. వీరందరికీ సెప్టెంబర్ 5వ తేదీన టీచర్స్ డే నాడు అవార్డులు ఇవ్వనున్నారు.