భారత్ ఆర్మీ వైరల్ ట్వీట్ : పాండవులు చేతకానివారు కాదు..

  • Published By: veegamteam ,Published On : February 26, 2019 / 08:46 AM IST
భారత్ ఆర్మీ వైరల్ ట్వీట్ :  పాండవులు చేతకానివారు కాదు..

Updated On : February 26, 2019 / 8:46 AM IST

జమ్ము కశ్మీర్ : పాక్ ఉగ్రస్థావరాలపై భారత వాయుసేన విరుచుకుపడింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోకి దూసుకెళ్లి ఉగ్రవాద శిబిరాలపై వాయుసేన యుద్ధ విమానాలు విజయవంతంగా దాడులు నిర్వహించి అనంతరం భారత్ ఆర్మీ ఓ ట్వీట్ చేసింది. అదిప్పుడు వైరల్ గా మారింది. సర్జికల్ ఎటాక్ తరువాత  భారత ఆర్మీ ఓ హిందీ పద్యాన్ని గుర్తు చేసుకుంది.భారత సైన్యం ప్రజా సంబంధాల విభాగం అడిషనల్ డైరెక్టర్ జనరల్, తన ట్విట్టర్ ఖాతాలో ప్రముఖ హిందీ కవి రామ్ ధారీ సింగ్ దినకర్ రచించిన పద్యాన్ని ఉంచారు.

కౌరవ, పాండవులను పోల్చుతూ సాగిన ఈ ట్వీట్ లో శత్రువు ముందు తలొగ్గి ఉన్నామన్నంత మాత్రాన బలహీనులమని కాదన్న అర్థం వచ్చేలా ఈ పద్యం సాగుతుంది. యుద్ధానికి దిగని పాండవులను కూడా కౌరవులు చేతగాని వారని భావించి నష్టపోయారని గుర్తు చేస్తుంది.