నిజామాబాద్ లో పసుపు బోర్డు ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్!

  • Published By: venkaiahnaidu ,Published On : January 15, 2020 / 02:46 PM IST
నిజామాబాద్ లో పసుపు బోర్డు ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్!

Updated On : January 15, 2020 / 2:46 PM IST

నిజామాబాద్ రైతుల కల నెలవేరబోతోంది. పండుగ రోజు నిజామాబాద్ రైతులకు కేంద్రం తీపి కబురు అందించింది. నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటు చేసే దిశగా.. బోర్డు డైరెక్టర్లుగా ఐఏఎస్‌ అధికారులను కేంద్రం నియమించింది. త్వరలో అధికారికంగా ఉత్తర్వులు జారీ చేయబోతున్నట్లు సమాచారం. నిజామాబాద్‌ కేంద్రంగా తెలంగాణ సుగంధ ద్రవ్యాల మార్కెటింగ్‌ వ్యవస్థను కూడా కేంద్రం ఏర్పాటు చేయనుంది. 

ఈ మధ్యాహ్నం 2 గంటల 50 నిమిషాలకు న్యూ ఢిల్లీ.. లోధి ఎస్టేట్.. ఒబెరాయ్ హోటల్ లో పియూష్ గోయల్ ప్రెస్ మీట్ కు ఏర్పాట్లు చేశారనీ… ఐతే చివరి నిమిషంలో ఆయన ప్రెస్ మీట్ రద్దయిందని Lనిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ చెప్పారు.  తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో… కేంద్ర వాణిజ్య శాఖ అధికారులు కేంద్రమంత్రికి సూచన చేశారనీ.. త్వరలోనే అధికారికంగా ఉత్తర్వులు జారీచేస్తామని కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖ తెలిపిందని అర్వింద్ అన్నారు.

త్వరలో నిజామాబాద్ పసుపు రైతుల కళ నెరవేరబోతోందని.. ఎన్నికల కోడ్ తర్వాత అధికారిక ప్రకటన వస్తుందని ఎంపీ ధర్మపురి అర్వింద్ చెప్పారు. గత లోక్ సభ ఎన్నికల సమయంలో పసుపు బోర్డు ఏర్పాటుకు కృషి చేస్తానని రైతులకు ధర్మపురి అరవింద్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.