సీమజిల్లాల్లో చంద్రబాబు ప్రచారం 

  • Published By: chvmurthy ,Published On : March 19, 2019 / 03:51 AM IST
సీమజిల్లాల్లో చంద్రబాబు ప్రచారం 

అమరావతి: నామినేషన్ల పర్వం మొదలవటంతో ప్రధాన  రాజకీయపార్టీలు తమ ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నాయి. టీడీపీ సోమవారం అర్ధరాత్రి  ఒంటి గంట దాటిన తర్వాత  చివరి విడతగా మిగిలిన  36  అసెంబ్లీ స్ధానాలకు,  మొత్తం 25  పార్లమెంట్ స్ధానాలకు అభ్యర్ధులను ప్రకటించింది.   తొలి విడత జాబితాలోని కొన్ని స్దానాలకు మార్పులు  చేర్పులు చేసింది.  పార్టీ   జాతీయ అధ్యక్షుడు చంద్రబాబాబు రెండో సారి అధికారం కైవసం చేసుకోటానికి  వయస్సును ఏ మాత్రం లెక్క చేయకుండా  రోజుకు రెండు మూడు జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ప్రతి జిల్లాలో  ఎన్నికల ప్రచార సభల్లో పాల్గోటం, స్ధానిక నాయకులు, బూత్  కన్వీనర్లతో సమావేశమై  దిశా నిర్దేశం చేస్తున్నారు. 

మంగళవారం ఆయన కర్నూలు,  అనంతపురం, కడప జిల్లాలలో జరిగే బహిరంగ సభల్లో పాల్గోని ప్రసంగిచనున్నారు. అనంతరం  చంద్రబాబు నాయుడు సేవా మిత్ర, బూత్ కన్వీనర్లతో సమావేశం కానున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ  ఉదయం కర్నూలు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఉదయం తొమ్మిదిన్నర గంటలకు ప్రత్యేక విమానంలో  సీఎం కర్నూలు విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో ఏపీఎస్‌పీ బెటాలియన్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి ఎస్టీబీసీ కళాశాల మైదానం వరకు రోడ్‌ షో నిర్వహించనున్నారు. రోడ్‌ షో అనంతరం ఎస్టీబీసీ కాలేజీ మైదానంలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొననున్నారు చంద్రబాబు.