గొడవ వద్దు.. రూ.35వేలు ఇస్తాం : ప్రాణానికి ఖరీదు కట్టిన డాక్టర్లు

మెదక్‌ జిల్లా శివంపేటలో విషాదం నెలకొంది. వైద్యుల నిర్లక్ష్యంతో రెండు నెలల చిన్నారి చనిపోయింది.

  • Published By: veegamteam ,Published On : November 3, 2019 / 05:47 AM IST
గొడవ వద్దు.. రూ.35వేలు ఇస్తాం : ప్రాణానికి ఖరీదు కట్టిన డాక్టర్లు

Updated On : November 3, 2019 / 5:47 AM IST

మెదక్‌ జిల్లా శివంపేటలో విషాదం నెలకొంది. వైద్యుల నిర్లక్ష్యంతో రెండు నెలల చిన్నారి చనిపోయింది.

మెదక్‌ జిల్లా శివంపేటలో విషాదం నెలకొంది. వైద్యుల నిర్లక్ష్యంతో రెండు నెలల చిన్నారి చనిపోయింది. శివంపేట మండలం నాణ్య తండాకు చెందిన శీను, పద్మల కూతురికి కడుపునొప్పి రావడంతో  నర్సాపూర్‌లోని అన్నపూర్ణ ఆస్పత్రిలో చేర్చారు. చికిత్స ప్రారంభించిన మూడు రోజుల తర్వాత చిన్నారి చనిపోయింది. 

అయితే పాప చనిపోయిన విషయం దాచిపెట్టిన వైద్యులు…  చిన్నారికి సీరియస్‌గా ఉందని హైదరాబాద్‌కు తరలించాలని చెప్పారు. అప్పటికే చిన్నారి చనిపోయిందని గమనించిన తల్లిదండ్రులు ఆస్పత్రి ఎదుట ధర్నాకు దిగారు. దీంతో ఆస్పత్రి యాజమాన్యం వారికి 35వేలు ఇచ్చి పంపింది.