చిరంజీవితో జగన్ లంచ్ మీట్: చర్చించిన అంశం ఇదేనా?

  • Published By: vamsi ,Published On : October 14, 2019 / 09:33 AM IST
చిరంజీవితో జగన్ లంచ్ మీట్: చర్చించిన అంశం ఇదేనా?

Updated On : October 14, 2019 / 9:33 AM IST

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ని మెగాస్టార్‌ చిరంజీవి దంపతులు కలిశారు. హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడకు చేరుకున్న చిరంజీవి తన భార్య సురేఖతో కలిసి తాడేపల్లిలో సీఎం జగన్‌ నివాసానికి వెళ్లారు.

చిరంజీవి దంపతులను జగన్ సాదరంగా ఆహ్వానించగా.. జగన్‌కు శాలువా కప్పి సత్కరించారు చిరంజీవి. ఇదే సమయంలో జగన్ భార్య భారతీ కూడా ఉన్నారు. మరోవైపు వీరిద్దరి భేటీలో పలు ఆసక్తికర అంశాలు చర్చకు వచ్చినట్లు రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా చర్చ జరుతుంది.

కొన్నేళ్లుగా చిరంజీవి పూర్తిగా రాజకీయాలను పక్కనపెట్టి.. సినిమాలపైనే దృష్టి సారించారు. అయితే ఉన్నట్టుండి వై.యస్.జగన్‌ని కలిటంతో సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

అయితే చిరంజీవి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన సినిమా తొలి స్వాతంత్ర్య ఈ సినిమాకు పన్ను మినహాయింపు కోసమే చిరంజీవి జగన్‌ను కలిసినట్లుగా కూడా చెబుతున్నారు. అలాగే ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా చూడాలంటూ జగన్‌ను కోరినట్లుగా చెబుతున్నారు.