నిరుద్యోగులకు గుడ్ న్యూస్ : త్వరలో ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ

అధికారంలోకి వచ్చిన స్వల్ప సమయంలోనే ఒకేసారి లక్షా 20 వేలకు పైగా సచివాలయం ఉద్యోగాలు భర్తీ చేసి రికార్డ్ సృష్టించిన ఏపీ సీఎం జగన్.. మరోసారి నిరుద్యోగులకు గుడ్ న్యూస్

  • Published By: veegamteam ,Published On : October 15, 2019 / 05:33 AM IST
నిరుద్యోగులకు గుడ్ న్యూస్ : త్వరలో ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ

Updated On : October 15, 2019 / 5:33 AM IST

అధికారంలోకి వచ్చిన స్వల్ప సమయంలోనే ఒకేసారి లక్షా 20 వేలకు పైగా సచివాలయం ఉద్యోగాలు భర్తీ చేసి రికార్డ్ సృష్టించిన ఏపీ సీఎం జగన్.. మరోసారి నిరుద్యోగులకు గుడ్ న్యూస్

అధికారంలోకి వచ్చిన స్వల్ప సమయంలోనే ఒకేసారి లక్షా 20 వేలకు పైగా సచివాలయం ఉద్యోగాలు భర్తీ చేసి రికార్డ్ సృష్టించిన ఏపీ సీఎం జగన్.. మరోసారి నిరుద్యోగులకు గుడ్ న్యూస్ వినిపించారు. మరిన్ని ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేసేందుకు సిద్ధమయ్యారు. వివిధ శాఖల అధికారులతో సీఎం జగన్ చర్చించారు. పలు శాఖల్లో ఉన్న ఖాళీలను వెంటనే భర్తీ చేయాలన్నారు. 

సీఎం జగన్ ఆదేశాలతో రాష్ట్రంలోని అన్ని శాఖల అధికారులతో సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం సమావేశమయ్యారు. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలను ప్రభుత్వానికి అందించాలని అధికారులను కోరారు. వారి నుంచి పూర్తి వివరాలు వచ్చాక నోటిఫికేషన్లు విడుదల చేయనుంది ప్రభుత్వం. ఏపీపీఎస్సీ ద్వారా పోస్టులను ఫిలప్ చేస్తారు. ప్రతి జనవరిలో ప్రభుత్వ శాఖల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఇప్పటికే సీఎం జగన్ తెలిపారు. 

అధికారంలోకి వస్తే అందరికీ ఉద్యోగాలు కల్పిస్తామని జగన్ ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. అన్నట్టుగానే అధికారంలోకి వచ్చాక హామీల అమలు దిశగా సీఎం ముందుకెళ్తున్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారు. లక్షా 20 వేలకు పైగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలను భర్తీ చేశారు. రాష్ట్రంలో నిరుద్యోగాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించే ప్రయత్నం చేస్తానని ప్రజా సంకల్ప యాత్రలో జగన్ చెప్పారు. అధికారం చేపట్టిన 4 నెలల్లోనే 2 లక్షల మంది గ్రామ, వార్డు వలంటీర్ ఉద్యోగాలను సృష్టించారు. ఆ తర్వాత గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పాటు చేసి.. 1.20 లక్షల మంది కార్యదర్శులను నియమించారు.