బిగ్ బ్రేకింగ్ : ఆంధ్రప్రదేశ్ కు 3 రాజధానులు..!?
ఏపీ సీఎం జగన్ సంచలన ప్రకటన చేశారు. రాజధానిపై అసెంబ్లీ వేదికగా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఏపీకి 3 రాజధానులు వస్తాయేమో అని సంచలన ప్రకటన చేశారు. పాలన ఒక

ఏపీ సీఎం జగన్ సంచలన ప్రకటన చేశారు. రాజధానిపై అసెంబ్లీ వేదికగా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఏపీకి 3 రాజధానులు వస్తాయేమో అని సంచలన ప్రకటన చేశారు. పాలన ఒక
ఏపీ రాజధానిపై అసెంబ్లీ వేదికగా సీఎం జగన్ సంచలన ప్రకటన చేశారు. మంగళవారం(డిసెంబర్ 17,2019) అసెంబ్లీలో రాజధాని గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. దీనిపై మాట్లాడుతూ.. ఏపీలో 3 రాజధానుల అవసరం ఉందన్న సీఎం జగన్.. ఏపీకి 3 రాజధానులు వస్తాయేమో అని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. పాలన ఒక దగ్గర, జ్యుడీషియల్ ఒక దగ్గర ఉండొచ్చు అన్నారు. అమరావతిలో లెజిస్లేటివ్ కేపిటల్, విశాఖలో ఎగ్జిక్యూటివ్ కేపిటల్ రావొచ్చన్నారు. కర్నూలులో హైకోర్టు, జ్యుడీషియల్ కేపిటల్ పెట్టొచ్చు అన్నారు.
ఏపీ రాజధాని అంశంపై పని చేస్తున్న నిపుణుల కమిటీ.. వారం రోజుల్లో నివేదిక ఇస్తుందని సీఎం జగన్ చెప్పారు. ఏపీకి బహుశా మూడు రాజధానులు ఉంటాయేమో అని అన్నారు. కమిటీ నివేదిక వచ్చాక రాజధాని అంశంపై తుది నిర్ణయం తీసుకుంటామని జగన్ చెప్పారు. ఒక రాష్ట్రానికి మూడు రాజధానులు ఉంటే తప్పేంటి అని జగన్ ప్రశ్నించారు. మనం కూడా మారాలి అన్న జగన్.. దక్షిణాఫ్రికాకు మూడు రాజధానులు ఉన్నాయని గుర్తు చేశారు. పరిపాలన వికేంద్రీకరణ జరగాల్సిన అవసరం ఉందని సీఎం జగన్ స్పష్టం చేశారు.
* అసెంబ్లీలో సీఎం జగన్ సంచలన ప్రకటన
* ఏపీకి 3 రాజధానులు అవసరం
* ఏపీకి 3 రాజధానులు రావొచ్చు
* అమరావతిలో లెజిస్లేటివ్(చట్టసభలు) క్యాపిటల్
* విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్
* కర్నూలులో హైకోర్టు, జ్యూడీషియల్ క్యాపిటల్
* అధికారులంతా విశాఖ నుంచే పని చేయొచ్చు
* ఒక రాష్ట్రానికి 3 రాజధానులు ఉంటే తప్పేంటి
* దక్షిణాఫ్రికాకు మూడు రాజధానులు ఉన్నాయి
* మనం కూడా మారాలి
* పరిపాలన వికేంద్రీకరణ జరగాల్సిన అవసరం ఉంది
* ఏపీలో సౌతాఫ్రికా మోడల్
ఏపీ రాజధాని గురించి అసెంబ్లీ వేదికగా సీఎం జగన్ చేసిన సంచలన ప్రకటన రాజకీయవర్గాల్లోనే కాదు ప్రజానికంలోనూ చర్చకు దారితీశాయి. 3 రాజధానుల రావొచ్చేమో అంటూ సీఎం చేసిన కామెంట్స్ గురించి విస్తృతంగా డిస్కషన్ నడుస్తోంది. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఏపీ రాజధానిపై సస్పెన్స్ నడుస్తోంది. రాజధానిగా అమరావతి ఉంటుందా లేదా అనే సందేహం ఉంది. రాజధానిని అమరావతి నుంచి తరలిస్తారు అనే వార్తలు పెద్ద ఎత్తున వచ్చాయి.
మంత్రులు చేసిన వ్యాఖ్యలు, సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాలు కూడా ఈ అనుమానాలకు బలం ఇచ్చాయి. రాజధానిగా అమరావతి ప్రాంతం అనువుగా లేదని మంత్రి బొత్స సత్యనారాయణ అనేకసార్లు ఉన్నారు. దీంతో ఏపీ రాజధాని ఏది? అనే చర్చ జోరుగా నడిచింది. అసలు సీఎం జగన్ మనసులో ఏముంది? అనేది ఆసక్తికరంగా మారింది. ఈ పరిస్థితుల్లో ఏపీకి 3 రాజధానులు రావొచ్చేమో అంటూ సీఎం జగన్ అనడం సంచలనమైంది.