కోడెల అధికార లాంఛనాల అంత్యక్రియలపై రగడ : పోలీసులు, టీడీపీ నేతల వాగ్వాదం

ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అధికార లాంఛనాలతో అంత్యక్రియలపై రగడ జరుగుతోంది. అధికార లాంఛనాలతో చేస్తామని అధికారులు చెబుతుంటే.. కుటుంబ సభ్యుల

  • Published By: veegamteam ,Published On : September 18, 2019 / 06:30 AM IST
కోడెల అధికార లాంఛనాల అంత్యక్రియలపై రగడ : పోలీసులు, టీడీపీ నేతల వాగ్వాదం

Updated On : September 18, 2019 / 6:30 AM IST

ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అధికార లాంఛనాలతో అంత్యక్రియలపై రగడ జరుగుతోంది. అధికార లాంఛనాలతో చేస్తామని అధికారులు చెబుతుంటే.. కుటుంబ సభ్యుల

ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అధికార లాంఛనాలతో అంత్యక్రియలపై రగడ జరుగుతోంది. అధికార లాంఛనాలతో చేస్తామని అధికారులు చెబుతుంటే.. కుటుంబ సభ్యుల మాత్రం వద్దని అంటున్నారు. కుటుంబసభ్యలు పట్టు వీడటం లేదు. దీంతో ఏం చేయాలో అర్థం కాక అధికారులు తల పట్టుకున్నారు. దీనిపై పోలీసులు, టీడీపీ నేతల మధ్య వాగ్వాదం జరిగింది. నిబంధనల ప్రకారమే అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తామని జల్లా కలెక్టర్ శ్యామూల్, ఎస్పీ విజయలక్ష్మి చెబుతున్నారు. దీనిపై మరోసారి కోడెల కటుంబసభ్యులతో మాట్లాడతామని, వారిని ఒప్పిస్తామని కలెక్టర్ తెలిపారు. లా అండ్ ఆర్డర్ విషయంలో చర్యలు తీసుకున్నామని పోలీసులు తెలిపారు. ఎలాంటి ఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. మరోసారి అధికార లాంఛనాలపై కుటుంబసభ్యులతో చర్చిస్తామన్నారు.