ఏపీపై కరోనా ఎఫెక్ట్: 161కి చేరుకున్న బాధితుల సంఖ్య

  • Published By: vamsi ,Published On : April 3, 2020 / 05:27 AM IST
ఏపీపై కరోనా ఎఫెక్ట్: 161కి చేరుకున్న బాధితుల సంఖ్య

Updated On : April 3, 2020 / 5:27 AM IST

కరోనా దెబ్బ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద గట్టిగా పడుతుంది. రాష్ట్రంలో రోజురోజుకు కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. లేటెస్ట్‌గా మరో పన్నెండు కరోనా కేసులు పాజిటివ్ తేలినట్లుగా ప్రకటించింది ప్రభుత్వం. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం కేసుల సంఖ్య 161 కి చేరుకుంది. నెల్లూరులో అత్యధికంగా 8 కేసులు నేడు నమోదయ్యాయి.

వీరు అందరూ కూడా ఢిల్లీ వెళ్లి వచ్చినట్టుగా అధికారులు గుర్తించారు. నెల్లూరు జిల్లాలో మొత్తం 32 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. గత నాలుగు రోజులుగా కరోనా కేసులు వేగంగా పెరుగుతుండగా… నెల్లూరు టాప్‌లో ఉంది. నాలుగు రోజుల్లో 140 కరోనా కేసులు నమోదు కావడంతో ప్రజల్లో ఆందోళన ఎక్కువయ్యింది. 

కరోనా వైరస్ నాలుగు రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్‌లో వేగంగా విస్తరిస్తుంది. ఢిల్లీ మత ప్రార్ధనలకు వెళ్లి వచ్చిన వారు ఎక్కువ మంది పాజిటివ్‌గా తేలారు. రాబోయే రెండు రోజుల్లో ఈ కేసులు మరింతగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఏపీలో తొలి కరోనా మరణం కూడా ఇవాళే నమోదైంది. కరోనా కారణంగా విజయవాడలో ఓ వ్యక్తి మరణించారు. 

Corona

Also Read | లాక్‌డౌన్ దేవుడికే.. బెంగాల్‌లో బారులు తీరిన భక్తులు