పాపిస్టోళ్లు: బోటు బాధిత కుటుంబాల నుంచి డబ్బు నొక్కేసిన సైబర్ నేరగాళ్లు

  • Published By: vamsi ,Published On : September 24, 2019 / 04:58 AM IST
పాపిస్టోళ్లు: బోటు బాధిత కుటుంబాల నుంచి డబ్బు నొక్కేసిన సైబర్ నేరగాళ్లు

Updated On : September 24, 2019 / 4:58 AM IST

నేరం చేసేవాళ్లకు నీతి, నిజాయితీ ఉండవు సరే కనీసం మానవత్వం కూడా ఉండదా? మోసం చేసేందుకు ఎవరూ తక్కువ కాదు అనుకున్నారేమో ప్రమాదంలో నా అనుకునే వాళ్లను కోల్పోయి, తీవ్ర విషాదంలో మునిగిపోయిన కచ్చులూరు బోటు బాధితులకు సైబర్ నేరగాళ్లు వల వేశారు. బోటు ప్రమాదంలో చనిపోయిన వ్యక్తుల కుటుంబాలకు ప్రభుత్వ అధికారుల పేర్లతో ఫోన్లు చేసి డబ్బులు నొక్కేశారు కొందరు కేటుగాళ్లు.

తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు బోటు ప్రమాదంలో  విశాఖ వాసి శంకర్ భార్య మరణించగా.. రూ. 17లక్షల పరిహారం ప్రభుత్వం అందిస్తుందంటూ శంకర్ కు ఫోన్ చేసి తెలిపిన నేరగాళ్లు.. రూ. 17లక్షలు కావాలంటే తాము చెప్పిన ఖాతాలో రూ. 10వేలు వేయాలని అతనిని కోరారు. దీనిని నమ్మిన శంకర్ రూ. 10వేలు  జమ చేసి మోసపోయాడు. శంకర్ కు సచివాలయం డిప్యూటీ సెక్రెటరీ పేరుతో ఫోన్ రాగా దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.