ఐపీఎల్ టాప్ 5 ప్లేయర్లలో ధావన్

ఐపీఎల్‌లో ఢిల్లీ జట్టుకు మారిన శిఖర్ ధావన్ రెండు మ్యాచ్ లలోనూ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు.

ఐపీఎల్ టాప్ 5 ప్లేయర్లలో ధావన్

Updated On : December 13, 2023 / 4:45 PM IST

ఐపీఎల్‌లో ఢిల్లీ జట్టుకు మారిన శిఖర్ ధావన్ రెండు మ్యాచ్ లలోనూ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు.

ఐపీఎల్‌లో ఢిల్లీ జట్టుకు మారిన శిఖర్ ధావన్ రెండు మ్యాచ్ లలోనూ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఢిల్లీ వేదికగా జరిగిన మ్యాచ్‌లో సొంతగడ్డపై చెన్నై బౌలర్ల ముందు సహనాన్ని కనబరిచి హఫ్ సెంచరీ చేయగలిగాడు. దీంతో ధావన్ ఐపీఎల్ టాప్ 5 స్కోరర్ల జాబితాలో చేరిపోయాడు.
Read Also : కష్టాల్లో ఉన్నాడేమో : రూ.40 కోట్లు ఇప్పించండి.. సుప్రీంకోర్టులో ధోనీ

ఐపీఎల్ టాప్ స్కోరర్ల జాబితాలో టాప్ స్థానంలో సురేశ్ రైనా(5004)పరుగులతో అగ్రస్థానంలో ఉండగా విరాట్ కోహ్లీ (4954), రోహిత్ శర్మ(4507), గౌతం గంభీర్ (4217) లతో తర్వాతి స్థానాలను దక్కించుకున్నారు. ఇప్పుడు వీరితో పాటు ధావన్ కూడా (4146)పరుగులతో టాప్ 5 స్థానాన్ని సొంతం చేసుకున్నాడు.

చెన్నై జట్టుపై టాస్ గెలిచి బ్యాటింగ్ దిగిన ఢిల్లీ.. ఓపెనర్‌గా ధావన్‌ను బరిలోకి దింపింది. పృథ్వీ షాతో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించిన ధావన్ తొలి 5ఓవర్లు మంచి దూకుడుగా ఆడాడు. ఆ తర్వాత ఢిల్లీ జట్టు తొలి వికెట్‌గా పృథ్వీ షా అవుట్ అవడంతో స్కోరు వేగం తగ్గింది. అప్పటికీ నిదానంగా వికెట్లు పడుతున్నా సహనంతో బ్యాటింగ్ చేసి తన కెరీర్‌లో 36వ హాఫ్ సెంచరీ నమోదు చేసుకున్నాడు ధావన్ (51: 47 బంతుల్లో).
Read Also : మనూ-సౌరవ్‌లు స్వర్ణాన్ని షూట్ చేశారు