దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై హర్షం : సీపీ సజ్జనార్ ఫోటోకు పాలాభిషేకం
దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సీపీ సజ్జనార్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సీపీ సజ్జనార్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సీపీ సజ్జనార్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. నల్లగొండ జిల్లాలో నిందితుల ఎన్‌కౌంటర్‌పై అయ్యప్ప స్వాములు స్పందించారు. సీపీ సజ్జనార్ చిత్రపటంతో ర్యాలీగా వెళ్లిన అయ్యప్ప స్వాములు.. చండూరు మున్సిపల్ పరిధిలోని కూడలి దగ్గర.. సజ్జనార్ చిత్రపటాన్ని పాలతో అభిషేకం చేశారు. పవర్ .. పవర్ .. పోలీస్ పవర్ అంటూ నినాదాలు చేశారు. నిందితుల ఎన్‌కౌంటర్‌తో దిశ ఆత్మ శాంతించిందన్నారు.
దిశ కేసులో నిందితులు నలుగురిని పోలీసులు ఎన్‌కౌంటర్ చేయడంపై .. విజయవాడ ఎస్‌ఆర్ కాలేజీ విద్యార్ధులు హర్షం వ్యక్తం చేశారు. యునైటెడ్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో .. సీపీ సజ్జనార్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. సజ్జనార్ జిందాబాద్.. దిశా జోహార్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం ర్యాలీ నిర్వహించారు. దిశ ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ..ఇలాంటి కఠిన చట్టాలు తీసుకురావాలన్నారు. మహిళలకు పోలీస్ వ్యవస్ధ వల్లే రక్షణ కలుగుతుందన్న విద్యార్ధులు.. చట్టాలు కఠినంగా ఉంటేనే నేరస్తులు అదుపులో ఉంటారని చెప్పారు.
దిశ హత్య కేసు నిందితుల ఎన్‌కౌంటర్‌పై విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ఫోటోకి విజయవాడ ఎస్‌ఆర్‌ఆర్ అండ్ సీవీఆర్ కాలేజీ విద్యార్థులు క్షీరాభిషేకం చేశారు. అత్యాచార నిందితులకు ఈ ఎన్‌కౌంటర్ ఒక హెచ్చరిక కావాలన్నారు. తెలంగాణ పోలీసులను ఏపీ పోలీసులు కూడా ఆదర్శంగా తీసుకోవాలని కోరారు.