వైసీపీలో చేరిన మాజీ మంత్రి: చంద్రబాబుకు ఓటమి తప్పదు

కడప జిల్లా రాజకీయాలను శాసించిన నేత మాజీ మంత్రి డీఎల్ రవీంద్రా రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో డీఎల్ రవీంద్రా రెడ్డి పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా డీఎల్ రవీంద్రారెడ్డి జగన్‌పై ప్రశంసలు కురిపించారు. నువ్వు నేను కలిస్తే మనం, మనం.. మనం కలిస్తే జనం, జనం.. జనం కలిస్తే కలిస్తే వైఎస్ జగన్ అని డీఎల్ అన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డితో తనకు 35ఏళ్ల అనుబంధం ఉందని, ఆయన తనయుడు వైఎస్ జగన్ పార్టీలో చేరడం సంతోషంగా ఉందని అన్నారు.
Read Also : Check It : ఏప్రిల్ 11న సెలవు
వైఎస్ జగన్ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి అనే ధీమాను డీఎల్ వ్యక్తం చేశారు. చంద్రబాబు అప్రజాస్వామిక నిర్ణయాలతో తప్పుడు నిర్ణయాలు ఎక్కువగా తీసుకుని, అవినీతికి పాల్పడ్డారని, జన్మభూమి కమిటీలతో తమవారికే న్యాయం చేసుకున్నారని విమర్శించారు. విలువైన ఓటుతో చంద్రబాబుకు బుద్ది చెప్పాలని డీఎల్ ప్రజలకు సూచించారు. 2004లో వైఎస్‌ఆర్ చేతిలో చంద్రబాబు ఎలా ఓడిపోయారో అలాగే 2019లో వైఎస్ జగన్ చేతిలో చంద్రబాబు ఓడిపోతారని డీఎల్ జోస్యం చెప్పారు.
Read Also : గెలుపు ఖాయం : సింహం సింగిల్‌గానే వస్తుంది