బాణాసంచా పేలుడు : ముగ్గురు మృతి

గుంటూరు జిల్లా చిలుకలూరిపేట ఎన్టీఆర్ కాలనీలో ఘోరం జరిగింది. బాణాసంచా పేలడంతో ముగ్గురు మృతి చెందారు.

  • Published By: veegamteam ,Published On : October 1, 2019 / 11:10 AM IST
బాణాసంచా పేలుడు : ముగ్గురు మృతి

Updated On : October 1, 2019 / 11:10 AM IST

గుంటూరు జిల్లా చిలుకలూరిపేట ఎన్టీఆర్ కాలనీలో ఘోరం జరిగింది. బాణాసంచా పేలడంతో ముగ్గురు మృతి చెందారు.

గుంటూరు జిల్లా చిలుకలూరిపేట ఎన్టీఆర్ కాలనీలో ఘోరం జరిగింది. బాణాసంచా పేలడంతో ముగ్గురు మృతి చెందారు. ఐదేళ్ల చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి, పరిస్థితి విషమంగా ఉంది. బాణాసంచా తయారుచేస్తుండగా మంటలు చెలరేగడంతో ప్రమాదం చోటు చేసుకుంది. పేలుడు ధాటికి ఇల్లు కుప్పకూలింది. మృతుల శరీర భాగాలు ఎగిరిపడ్డాయి. మహిళ కాలు పక్కనే ఉన్న స్థలంలో తెగిపడింది. గుర్తు పట్టలేని విధంగా శరీర భాగాలు తయారు అయ్యాయి. 

ఎన్టీఆర్ కాలనీలో నాగార్జున, ఆదిలక్ష్మీ దంపతులు, వారి ఐదేళ్ల కుమార్తె శృతి  నివాసముంటున్నారు. నాగార్జున ఆటో డ్రైవర్ గా జీవనం కొనసాగిస్తున్నాడు. నాగార్జున, ఆదిలక్ష్మీతోపాటు మరో మహిళ దివ్య కలిసి చుట్టు పక్కల ప్రాంతాల వారికి తెలియకుండా గుట్టుచప్పుడు కాకుండా దీపావళి బాణాసంచా తయారు చేస్తున్నారు. టపాసులు తయారు చేస్తున్నక్రమంలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. 

ఘటనాస్థలంలోనే ఆదిలక్ష్మీ, దివ్య మృతి చెందారు. నాగార్జునను చికిత్స కోసం ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయారు. వారి కుమార్తె శృతికి తీవ్ర గాయాలు అయ్యాయి. చిన్నారికి కళ్లు కనిపించడం లేదు. షాక్ నుంచి చిన్నారి తేరుకోలేదు. మృతుల శరీర భాగాలు గుర్తు పట్టలేనంతగా ఉన్నాయి. పేలుడు ధాటికి దివ్య కాలు పక్కనే ఉన్న స్థలంలో తెగి పడిపోయింది. 

ముందుగా గ్యాస్ సిలిండర్ పేలిందని అందరూ అనుకున్నారు. కానీ ఎమ్మార్వో, సీఐ ఘటనాస్థలికి వెళ్లి చూసిన తర్వాత గంధకం, నేల టపాసులు తయారు చేస్తున్నట్లు గుర్తించారు. నేల టపాసులు దానికి సంబంధించిన గంధకం లభ్యమయ్యాయి. దీంతో పేలుడు సంభవించిందని భావించారు.