పెళ్లి భోజనం వికటించి ముగ్గురు మృతి

  • Published By: veegamteam ,Published On : May 8, 2019 / 03:54 PM IST
పెళ్లి భోజనం వికటించి ముగ్గురు మృతి

Updated On : May 8, 2019 / 3:54 PM IST

ఆదిలాబాద్ : నార్నూరు మండలం గణపతిగూడలో విషాదం నెలకొంది. పెళ్లి భోజనం వికటించి ముగ్గురు మృతి చెందారు. మరో 24 మందికి అస్వస్థతకు గురయ్యారు. మృతులు కొడప ముత్తు, లక్ష్మణ్, భీం బాయిగా గుర్తించారు. బాధితులకు ఉట్నూరు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. 

చికిత్స పొందుతున్న వారిలో ఏడుగురి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం తెలుసుకున్న ఉన్నతాధికారులు ఆస్పత్రికి చేరుకుని బాధితులను పరామర్శించారు. వారిని మెరుగైన చికిత్స కోసం ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. నార్నూర్ లో ఐటీడీఏ అధికారులు విచారణ చేపట్టారు.