ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం : ఐసీయూలో పొగలు.. అప్పుడే పుట్టిన శిశువు మృతి
అనంతపురం జిల్లా హిందూపురం ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం జరిగింది. మాత శిశు వార్డులోని ఎయిర్ కంప్రెసర్ కండెన్సర్ కాలిపోవడంతో పొగలు వ్యాపించాయి. పొగ కారణంగా ఊపరి ఆడక అప్పుడే పుట్టిన మగశిశువు మృతి చెందాడు.

అనంతపురం జిల్లా హిందూపురం ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం జరిగింది. మాత శిశు వార్డులోని ఎయిర్ కంప్రెసర్ కండెన్సర్ కాలిపోవడంతో పొగలు వ్యాపించాయి. పొగ కారణంగా ఊపరి ఆడక అప్పుడే పుట్టిన మగశిశువు మృతి చెందాడు.
అనంతపురం జిల్లా హిందూపురం ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం జరిగింది. మాత శిశు వార్డులోని ఎయిర్ కంప్రెసర్ కండెన్సర్ కాలిపోవడంతో పొగలు వ్యాపించాయి. పొగ కారణంగా ఊపరి ఆడక అప్పుడే పుట్టిన మగశిశువు మృతి చెందాడు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. వార్డు మొత్తం పొగ వ్యాపించడంతో పేషెంట్లు పరుగులు తీశారు. విషయం తెలిసిన వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు విచారణ ప్రారంభించారు. మరోవైపు ఆస్పత్రి నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రమాదం జరిగిదంటూ శిశువు బంధువులు ఆస్పత్రి ఎదుటు ఆందోళనకు దిగారు.
రాత్రి 11 గంటల సమయంలో ఎయిర్ కంప్రెసర్ కండెన్సర్ కాలిపోవడంతో వార్డు మొత్తం పొగలు వ్యాపించాయి. పేషెంట్లు భయంతో బయటికి పరుగులు తీశారు. పొగ వ్యాపించడంతో బయటికి పరుగెత్తే క్రమంలో బాలింత కింద పడిపోవడంతో సిజేరియన్ కుట్లు ఊడిపోవడంతో ఆమె పరిస్థితి విషమంగా ఉంది. మరో ఇద్దరు చిన్నారుల పరిస్థితి సీరియస్ గా ఉంది. వారిని అనంతపురం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న డాక్టర్లు దాన్ని మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. 10 గంటల నుంచి ఆస్పత్రిలో డాక్టర్లు ఎవరూ లేరని…నర్సులు కూడా ఐసీయూలో లేరని.. వైర్లు కాలిపోవడంతో పొగ వ్యాపించింది. దీంతో భయభ్రాంతులకు గురైన పేషెంట్లు బయటికి పరుగెత్తారు.
పొగ వ్యాపించడంతో ఊపిరాడకనే చిన్నారి చనిపోయాడని అంటున్నాడని శిశువు తల్లిదండ్రులు అంటున్నారు. సిజేరియన్ చేసిన అబ్బాయిని బయటికి తీశామని, 24 గంటలు గడిస్తే గానీ శిశవు పరిస్థితి చెప్పలేమని చెప్పినట్లు డాక్టర్లు అంటున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. డాక్టర్ల నిర్లక్ష్యం జరిగిందా.. పొగ వ్యాపించడం వల్ల శిశువు చనిపోయాడా అనేది విచారణలో తేలనుంది.