గాంధీజీ ఆదర్శాలే స్ఫూర్తిగా ఏపీ అభివృద్ది : సీఎం జగన్

  • Published By: veegamteam ,Published On : October 2, 2019 / 05:03 AM IST
గాంధీజీ ఆదర్శాలే స్ఫూర్తిగా ఏపీ అభివృద్ది : సీఎం జగన్

Updated On : October 2, 2019 / 5:03 AM IST

ఏపీ రాజధాని అమరావతిలో సీఎం జగన్ మహాత్మా గాంధీకి నివాళులర్పిచారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ..గాంధీజీ ఆదర్శాలే స్ఫూర్తిగా ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి దిశగా నడిపించేందుకు కృషి చేస్తామని తెలిపారు. 

దేశానికి గ్రామాలే పట్టుకొమ్మలని బాపూజీ సెలవిచ్చారు.ఆ మాటలను ఆదర్శంగా తీసుకుని  గాంధీజీ గ్రామ స్వరాజ్యాన్ని గ్రామ సచివాలయాల ఏర్పాటు ద్వారా సాధిస్తామన్నారు.  గాంధీ ఆశయంలో భాగంగా ఆయన 150 జన్మదినం సందర్భంగా ఏపీలోఆయన కలల్ని సాకారంచేస్తామన్నారు. దీంట్లో భాగంగా బెల్ట్ షాపులను విడతలవారీగా నిషేధిస్తున్నామనీ.. ఈ క్రమంలో తాము అధికారంలోకి వచ్చిన అనంతరం గత నాలుగు నెలల్లో 43వేల బెల్ట్ షాపులను మూసివేశామని తెలిపారు. 

రైతులే దేశానికి వెన్నెముక అని గాంధీజీ చెప్పారు. రైతులు, పేదలు, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి వారి సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. దీంట్లో భాగంగానే నవరత్నాలు అమలు చేస్తున్నామని అన్నారు సీఎం జగన్.