రాట్నంపై దారం తెగకుండా.. అఖండ సూత్ర యజ్ఞం

  • Published By: veegamteam ,Published On : October 2, 2019 / 07:53 AM IST
రాట్నంపై దారం తెగకుండా.. అఖండ సూత్ర యజ్ఞం

Updated On : October 2, 2019 / 7:53 AM IST

భారత జాతిపిత మహాత్మా గాంధీ 150వ జయంతి ఉత్సవాలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా కరీంగనర్ జిల్లా జమ్మికుంట మండలం వావిరాల ఖాదీ పరిశ్రమలో గాంధీజీ జయంతిని పురస్కరించుకుని అఖండ సూత్ర యజ్ఞం కార్యక్రమాన్ని కార్మికులు చేపట్టారు. ప్రతీ సంవత్సరం అక్టోబర్ 2 గాంధీజీ జయంతి రోజున అఖండ సూత్ర యజ్ఞం కార్యక్రమాన్ని 24 గంటలపాటు నిర్వహిస్తుంటారు.

ఈ అఖండ సూత్ర యజ్ఞంలో భాగంగా..వావిరాలలో గాంధీజీని స్మరించుకుంటు ప్రతీ సంవత్సరం అక్టోబర్ 2న గాంధీ విగ్రహం ముందు రాట్నంపై నూలు వడుకుతారు.దీంట్లో మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే..రాట్నం నూలు వడికేటప్పుడు దారం తెగకుండా 24 గంటల పాటు అంత్యంత చాక చక్యంగా  ఖాదీ కార్మికులు వడుకుతారు. ఈ అఖండ సూత్ర యజ్ఞంలో ఇదే విశేషం. అక్టోబర్ 2 ఉదయం 6 గంటల నుంచి రేపు 6 గంటల వరకూ ఈ అఖండ సూత్ర యజ్నం కార్యక్రమాన్ని కార్మికులు కొనసాగిస్తారు. ఇది ప్రతీ సంవత్సరం క్రమం  తప్పకుండా నిర్వహిస్తుండం విశేషం.  

కాగా భారత స్వాతంత్ర్య పోరాటంతో గాంధీజీ రాట్నంపై నూలు వడకటం..విదేశీ వస్త్రాలను బహిష్కరించి ఖాదీ వస్త్రాలను ధరించాలని పిలుపునివ్వటం చాలా కీలక పాత్రను పోషించిన విషయం తెలిసిందే.