జగన్‌కు ఒక్క ఛాన్స్ ఇవ్వండి – విజయమ్మ
ఎన్నికల్లో జగన్‌కు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటున్నారు విజయమ్మ. మాట ఇస్తే మడమతిప్పేరకం జగన్ కాదు. వైఎస్ చేసినట్లే జగన్ కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని అనుకుంటున్నారు.

ఎన్నికల్లో జగన్‌కు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటున్నారు విజయమ్మ. మాట ఇస్తే మడమతిప్పేరకం జగన్ కాదు. వైఎస్ చేసినట్లే జగన్ కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని అనుకుంటున్నారు.
ఎన్నికల్లో జగన్‌కు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటున్నారు విజయమ్మ. మాట ఇస్తే మడమతిప్పేరకం జగన్ కాదు..వైఎస్ చేసినట్లే జగన్ కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని అనుకుంటున్నారు.. ఈ 9 ఏళ్లకాలంలో జగన్ వ్యక్తిత్వం ఏంటో చూశారు.. అని విజయమ్మ వెల్లడిస్తున్నారు. వైసీపీ అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల ప్రచారంలోకి దిగారు జగన్ తల్లి విజయమ్మ. మార్చి 29వ తేదీ శుక్రవారం ప్రకాశం జిల్లా కందుకూరు నుండి ఎన్నికల క్యాంపెయిన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ప్రసంగించారు.
Read Also : లక్ష్మీస్ ఎన్టీఆర్ రివ్యూ
మీ కోసం బాధలో ఉన్నా ఓదార్పు యాత్ర చేశారని, 9 ఏళ్ల కాలంలో జగన్ ప్రజలతో గడిపారని తెలిపారు. సీఎం చంద్రబాబు హామీలను నెరవేర్చకుండా ఎంతసేపూ జగన్..అంటూ జపం చేస్తున్నారని విమర్శించారు. ఈ 9 ఏళ్ల కాలంలో చేసిన కుట్రలను భరించినట్లు..తన కొడుకుని జైలులో పెట్టించి కొంతకాలం దూరం చేశారని తెలిపారు. వైఎస్ జగన్ ప్రకటించిన నవరత్నాలను బాబు కాపీ కొట్టారని, పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు.
Read Also : గుండెలు అదిరాయి : డ్రంక్ అండ్ డ్రైవ్‌కు మరణ శిక్ష
పరిటాల హత్యకు జగన్ కారణమని చెబితే..తన కొడుకు తప్పు చేస్తే ఉరి తీయాలని వైఎస్ ఆనాడు చెప్పారని గుర్తు చేశారు విజయమ్మ. రాజారెడ్డి హత్య వెనుక ఎవరున్నారో అందరికీ తెలుసని..ఈ విషయంలో వైఎస్ మౌనంగా ఉన్నారని..శిక్షించడానికి చట్టాలున్నాయని ఆయన చెప్పినట్లు తెలిపారు. వైఎస్ మృతి కూడా తనకు అనుమానంగానే ఉందన్నారు.
ఎయిర్ పోర్టులో జగన్‌ని హత్య చేయాలని చూశారని..ప్రజల ఆశీర్వాదం వల్లనే ఎయిర్ పోర్టులో జగన్ బయటపడ్డారన్నారు. ఇది జరిగిన కొద్ది రోజులకు వైఎస్ వివేకానందనరెడ్డిని హత్య చేయించారన్నారు. ఈ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులను గెలిపించాలని విజయమ్మ ఓటర్లను కోరారు.
Read Also : లైన్ క్లియర్: థియేటర్‌లలో లక్ష్మీ’స్ ఎన్‌టీఆర్.. ఫస్ట్ టాక్ ఇదే!