నామినేషన్ పడింది : కోర్టు ఆదేశాలతో మాధవ్ కు లైన్ క్లియర్

నామినేషన్ పడింది : కోర్టు ఆదేశాలతో మాధవ్ కు లైన్ క్లియర్

Updated On : March 25, 2019 / 12:46 PM IST

వైసీపీ హిందూపురం ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగనున్న మాజీ పోలీసు అధికారి గోరంట్ల మాధవ్ నామినేషన్‌ కు లైన్ క్లియర్ అయింది. ట్రిబ్యునల్‌ ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ హైకోర్టు గోరంట్ల మాధవ్‌ నామినేషన్‌కు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఏపీ ప్రభుత్వం వేసిన స్టే పిటిషన్‌ను నిరాకరించిన హైకోర్టు గోరంట్ల నామినేషన్‌కు అనుమతి ఇచ్చింది. రాజకీయాల్లో చేరే క్రమంలో రెండు నెలల క్రితమే గోరంట్ల వీఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకున్నారు. కానీ ఏపీ ప్రభుత్వం ఆయన అభ్యర్థనను ఆమోదించకుండా పక్కనబెట్టింది.

దీనిపై ట్రిబ్యునల్‌ తీర్పును వెలువరిస్తూ తక్షణమే మాధవ్‌ వీఆర్‌ఎస్‌ను ఆమోదించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాజకీయ కారణాలతో వీఆర్‌ ఎస్‌ ను నిలిపివేయడం సరికాదని ట్రిబ్యునల్‌ అభిప్రాయపడింది. ట్రిబ్యునల్‌ తీర్పుపై ఏపీ ప్రభుత్వం హైకోర్టులో స్టేపిటిషన్‌ వేసింది. కానీ హైకోర్టు ఆ పిటిషన్‌ను నిరాకరిస్తూ ట్రిబ్యునల్‌ తీర్పును సమర్థించింది.హైకోర్టు తీర్పు సకాలంలో రావడంతో మాధవ్ నామినేషన్ ప్రక్రియ సజావుగా ముగిసింది.