4 రెడ్ జోన్లు, 2 కర్ఫ్యూ ప్రాంతాలు.. విజయవాడలో భయం, భయం
విజయవాడలో కరోనా టెన్షన్ నెలకొంది. కరోనా కేసులు 6కి చేరడంతో బెజవాడ వాసులు భయంతో వణికిపోతున్నారు. అలర్ట్ అయిన అధికారులు ముందు జాగ్రత్తగా నగరంలో

విజయవాడలో కరోనా టెన్షన్ నెలకొంది. కరోనా కేసులు 6కి చేరడంతో బెజవాడ వాసులు భయంతో వణికిపోతున్నారు. అలర్ట్ అయిన అధికారులు ముందు జాగ్రత్తగా నగరంలో
విజయవాడలో కరోనా టెన్షన్ నెలకొంది. కరోనా కేసులు 6కి చేరడంతో బెజవాడ వాసులు భయంతో వణికిపోతున్నారు. అలర్ట్ అయిన అధికారులు ముందు జాగ్రత్తగా నగరంలో నాలుగు చోట్ల రెడ్ జోన్లుగా ప్రకటించారు. రెండు ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు. పాతబస్తీ, అయోధ్యనగర్, రామలింగేశ్వర్ నగర్, భవానీపురం ప్రాంతాల్లో రాకపోకలు నిలిపివేశారు. ఢిల్లీలో మతపరమైన కార్యక్రమాలకు వెళ్లిన నగరానికి చెందిన 46మందిని ఐసోలేషన్ వార్డులకు తరలించారు.
వీరిలో కొందరికి కరోనా లక్షణాలు ఉండటంతో నగరవాసుల్లో టెన్షన్ నెలకొంది. ఇటు అజ్మీర్ నుంచి వచ్చిన ముగ్గురిని అదుపులోకి తీసుకున్న అధికారులు వారిని వైద్య పరీక్షలకు తరలించారు. రాజరాజేశ్వరిపేటలో కరోనా లక్షణాలతో మరణించిన వ్యక్తి అంత్యక్రియలకు హాజరైన వారి వివరాలు సేకరిస్తున్నారు అధికారులు.
కరోనా కేసుల సంఖ్య 6కి పెరగడంతో విజయవాడ వాసులు ఇళ్ల నుంచి బయటకు రావడానికి భయపడుతున్నారు. పాతబస్తీ, భవానీపురం ప్రాంతాలను పోలీసులు పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేశారు. లోపలి వారిని బయటకు రానివ్వడం లేదు. బయటివారిని లోనికి వెళ్లనివ్వడం లేదు. విద్యాధరపురంలో ఢిల్లీ నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా సోకింది. అతడి తల్లిదండ్రులు చనిపోయారు. దీంతో భయానకవాతావరణం నెలకొంది. ఢిల్లీ నుంచి వచ్చిన 46మందిని విద్యాధరపురంలోని ఆర్టీసీ ఆసుపత్రికి తరలించారు. రాజరాజేశ్వరి పేటకు చెందిన వ్యక్తి మరణించడం, అతడి భార్యకు కరోనా నిర్ధారణ కావడం కలకలం రేపింది. అంత్యక్రియలకు హాజరైన వారి వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. 20మంది హాజరైనట్టు తెలుసుకున్న అధికారులో వారిలో 11మందిని గుర్తించారు. కండీషన్ సీరియస్ గా ఉండటంతో ప్రజలెవరూ ఇంటి నుంచి బయటకు రావొద్దని అధికారులు సూచిస్తున్నారు.
భయం నిజమైంది. ఏపీలో ఢిల్లీ బాంబు పేలింది. రాష్ట్రంలో కరోనా వైరస్ మహమ్మారి విజృంభించింది. ఒక్కసారిగా కోవిడ్ 19 కేసుల సంఖ్య డబుల్ అయ్యింది. ఏపీలో కరోనా కేసుల సంఖ్య 87కి పెరిగింది. ఈ ఒక్కరోజే 43 మందికి కరోనా సోకింది. ఢిల్లీ నుంచి వచ్చిన వారిలోనే కరోనా ఎక్కువగా ఉంది. దీంతో ఏపీలో కలకలం రేగింది.
ఇప్పటివరకు ఒక్క కరోనా కేసు కూడా లేని రెండు జిల్లాల్లో ఒక్కసారిగా పదుల సంఖ్య కేసులు నమోదయ్యాయి. సీఎం జగన్ సొంత జిల్లా కడపలో 15, పశ్చిమగోదావరి జిల్లాలో 13 కేసులు నమోదయ్యాయి.
మంగళవారం(మార్చి 31,2020) రాత్రి 9 గంటల నుంచి బుధవారం(ఏప్రిల్ 1,2020) ఉదయం 9 గంటల మధ్య 43 కొత్త కేసులు నమోదైనట్టు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ తాజా బులెటిన్ లో తెలిపింది. ఇద్దరి ఆరోగ్య పరిస్థితి మెరుగైనట్లు తెలిపింది. గత 12 గంటల వ్యవధిలో 373మంది నమూనాలు పరీక్షించగా అందులో 330 నెగిటివ్ గా నిర్ధారణ అయినట్లు అధికారులు తెలిపారు.
దీంతో ఏపీలో వైరస్ భయం నెలకొంది. కేసుల సంఖ్య భారీగా పెరగడంతో రాష్ట్ర ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇటీవల ఢిల్లీలో మతపరమైన ప్రార్థనల్లో పాల్గొని వచ్చిన వారిలోనే కరోనా కేసులు ఎక్కువగా నమోదైనట్టు గుర్తించిన అధికారులు వారిపై మరింత ఫోకస్ పెట్టారు. జిల్లాల్లో కోవిడ్ చాప కింద నీరులా విస్తరిస్తోంది. ఒక్క ప్రకాశం జిల్లాలోనే ఇప్పటివరకు 15 కేసులు నమోదయ్యాయి. ఫస్ట్ టైమ్ కడపలో 15 కేసులు, పశ్చిమగోదావరి జిల్లాలో 13 కేసులో నమోదయ్యాయి. విశాఖలో 13, గుంటూరులో 9, కృష్ణా జిల్లాలో 6, తూర్పుగోదావరి జిల్లాలో 6, అనంతపురం జిల్లాలో 2, చిత్తూరు జిల్లాలో 6, నెల్లూరు జిల్లాలో 2, కర్నూలు జిల్లాలో ఒక కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కేసుల్లో ఢిల్లీకి లింక్ ఉన్నట్లు అధికారులు తెలుపుతున్నారు.
మార్చి 31 రాత్రి 9 నుంచి ఏప్రిల్ 1 ఉదయం 9 వరకు నమోదైన 43 కేసులు..జిల్లాల వారీగా..
Also Read | కరోనా అలెర్ట్ : నల్గోండ జిల్లాలో బర్మాదేశస్ధుల సంచారం