పవన్ కళ్యాణ్ డిశ్చార్జ్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. ఈ విషయాన్ని జనసేన పార్టీ ట్విట్టర్‌లో తెలిపింది.

  • Published By: madhu ,Published On : April 6, 2019 / 08:53 AM IST
పవన్ కళ్యాణ్ డిశ్చార్జ్

Updated On : April 6, 2019 / 8:53 AM IST

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. ఈ విషయాన్ని జనసేన పార్టీ ట్విట్టర్‌లో తెలిపింది.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. ఈ విషయాన్ని జనసేన పార్టీ ట్విట్టర్‌లో తెలిపింది. హాస్పిటల్ నుండి పవన్ బయటకు వస్తున్న ఫొటోలను ట్వీట్ చేసింది. ఏపీ రాష్ట్రంలో ఏప్రిల్ 11వ తేదీ జరిగే అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తోంది.

అభ్యర్థుల విజయం కోసం పవన్ రాష్ట్రంలో పలు జిల్లాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఆయా బహిరంగసభల్లో పాల్గొంటున్నారు. ఎండలు విపరీతంగా ఉండడంతో పవన్ కొంత అస్వస్థతకు గురయ్యారు. ఏప్రిల్ 05వ తేదీన పవన్ విజయనగరం జిల్లాలో ప్రచారం చేస్తుండగా వడదెబ్బ తగిలింది. నీరసంగా ఉన్న ఆయన్ను ఆయుష్ ఆసుపత్రికి తరలించారు. 
Read Also : వైసీపీ హామీ : జగన్ వస్తే కొత్త జిల్లాలు ఇవే

పవన్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారనే వార్త గుప్పుమనడంతో అభిమానులు కొంత టెన్షన్ పడ్డారు. మరో 4 రోజుల్లో పోలింగ్ జరుగుతున్న సమయంలో పవన్ అస్వస్థతకు గురి కావడంతో పార్టీ అభ్యర్థులు, కార్యకర్తలు కొంత ఆందోళన చెందారు. దీని కారణంగా గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లి, తెనాలి నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారానికి బ్రేక్ ఇచ్చారు పవన్. 

నాలుగు గంటల పాటు చికిత్స తీసుకున్న అనంతరం ఆయన ఆరోగ్యం మెరుగుపడింది. దీనితో పవన్‌ను వైద్యులు డిశ్చార్జ్ చేశారు. అయితే ఒక రోజు మాత్రం రెస్ట్ తీసుకోవాలని వైద్యులు సూచించారు. మరి..పవన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారా ? లేదా ? అనేది తెలియాల్సి ఉంది.
Read Also : వైఎస్ఆర్ కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల