జనసేన ఆఫీసులకు టూలెట్ బోర్డులు: స్పందించిన పవన్ కళ్యాణ్

25 సంవత్సరాల సుదీర్ఘ టార్గెట్‌ను పెట్టుకుని రాజకీయాల్లోకి ప్రవేశించిన జనసేన.. ఎన్నికల తర్వాత ఏపీ రాష్ట్రంలోని కొన్ని ఆఫీసులను మూసివేసినట్లు వార్తలు వచ్చాయి. జనసేన పార్టీ దుకాణం బంద్ అయిందని, పార్టీ కార్యాలయాల ముందు టూ-లెట్ బోర్డులు పెట్టేస్తున్నారని సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరిగింది. ఏపీలో పోలింగ్ ముగిశాక జనసేన సైలెంట్‌గా ఉండడం పార్టీ కార్యాలయాలు ఖాళీ చేయడం ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారింది.
Also Read : సీసీ కెమెరాల్లో సూసైడ్ బాంబర్ : ఆత్మాహుతికి ముందు పిల్లలతో ముచ్చట్లు
ఈ క్రమంలో జనసేన ఆఫీసులు మూసివేసినట్లు వచ్చిన వార్తలపై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పార్టీ ఎన్నికల సమిక్షా సమయంలో మాట్లాడారు. నియోజకవర్గాల్లోని జనసేన కార్యాలయాలు యథావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఇది ఆరంభం మాత్రమేనని, సమాజంలో మంచి మార్పుకోసం జనసైనికులు ముందుకు సాగాలని పవన్ పార్టీ అభ్యర్థులకు పిలుపునిచ్చారు. క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళ్లి కలుసుకుని సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని, గెలిచినా, ఓడినా ప్రజల వెంట ఉండాలని సూచించారు.
ఇక మరోవైపు పార్టీలో కీలకంగా వ్యవహిరించిన వ్యక్తులు అద్దేపల్లి శ్రీధర్ లాంటి నాయకులు ఆ పార్టీకి దూరంగా ఉండడం కూడా కాస్త ఇబ్బందికరంగా తయారైంది.
Also Read : మీ ఆధార్ కార్డు పోయిందా? : e-Aadhaar డౌన్ లోడ్ చేసుకోండిలా