ఆగమాగం కావొద్దు : దేశంలో మార్పు రావాలి – KCR

దేశంలో సాగు, తాగు నీటికి కటకటా ఉందా ? 3.50 లక్షల మెగావాట్ల కరెంటు లేదా ? దేశ రాజకీయ దశ..దిశను మారుస్తా..

  • Published By: madhu ,Published On : April 1, 2019 / 12:54 PM IST
ఆగమాగం కావొద్దు : దేశంలో మార్పు రావాలి – KCR

Updated On : April 1, 2019 / 12:54 PM IST

దేశంలో సాగు, తాగు నీటికి కటకటా ఉందా ? 3.50 లక్షల మెగావాట్ల కరెంటు లేదా ? దేశ రాజకీయ దశ..దిశను మారుస్తా..

దేశంలో సాగు, తాగు నీటికి కటకటా ఉందా ? 3.50 లక్షల మెగావాట్ల కరెంటు లేదా ? దేశ రాజకీయ దశ..దిశను మారుస్తా.. తన మేథస్సు రంగరించి దేశం కోసం కొట్లాడుతా…అని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. రాహుల్..మోడీ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ప్రజలను ఆగమాగం కావొద్దని సూచించారు. ఐదేళ్ల మోడీ పాలనలో దేశంలో ఎలాంటి మార్పు రాలేదన్నారు. 16 TRS ఎంపీలను గెలిపించి పార్లమెంట్‌కు పంపించాలని..దేశంలో గొప్ప మార్పు కోసం తాను ప్రయత్నిస్తున్నట్లు..ఇప్పటికే ఎంతోమందితో తాను మాట్లాడినట్లు కేసీఆర్ చెప్పారు. 
Read Also : ఎన్నికల తర్వాతే… ప్రధాని రేసులో లేనన్న ములాయం

ఏప్రిల్ 01వ తేదీ సోమవారం పెద్దపల్లి నియోజకవర్గంలో గోదావరిఖనిలో TRS నిర్వహించిన బహిరంగసభలో కేసీఆర్ పాల్గొని ప్రతిపక్షాలపై విమర్శలు చేశారు. గజిబిజి వద్దూ..గందరగోళ పడొద్దు…తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకముందు..ఇప్పుడున్న పరిస్థితులు బేరీజు వేసుకోవాలని సూచించారు. చోర్..చోర్ అంటూ రాహుల్..మోడీ కొట్లాడుతున్నారు..ఐదేళ్ల మోడీ పాలనలో ఏం జరిగింది ? మోడీ..రాహుల్ గెలిస్తే దేశం ఏదైనా మారుతుందా ? అని సూటిగా ప్రశ్నించారు కేసీఆర్.

గుణాత్మకమైన మార్పు రావాలని పిలుపునిచ్చారు. ప్రజలు ఆగం కావాలనే వారు అలా చేస్తున్నారని విమర్శించారు. బొగ్గు గని కార్మికుల ఇన్ కం ట్యాక్స్‌పై అసెంబ్లీ తీర్మానం చేసి పంపించినా..ఏమి చేయలేదన్నారు. దేశంలో సంపద ఉంది..వనరులున్నాయి..వాడే తెలివి లేని వారున్నారని విమర్శించారు కేసీఆర్. ఈ సభలో టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. 
Read Also : జగనే కారణం : పులిలాంటి కడప పిల్లిలా మారింది