ఆ జిల్లాలో పశువులకూ ఆధార్‌ ఉండాల్సిందే

అనంతపురం జిల్లాలోని ప్రతి పశువుకూ ఆధార్‌కార్డు మాదిరి ఒక నంబరు కేటాయించి ట్యాగ్‌ చేస్తామని డిస్ట్రిక్‌ లైవ్‌స్టాక్‌ డెవలప్‌మెంట్‌ ఏజెన్సీ (డీఎల్‌డీఏ) ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (ఈఓ) డాక్టర్‌ ఎన్‌.తిరుపాలరెడ్డి తెలిపారు. ఇన్‌ఫర్మేషన్‌ నెట్‌వర్క్‌ ఫర్‌ ఎనిమల్‌ ప్రొడక్టివిటీ అండ్‌ హెల్త్‌ (ఇనాఫ్‌) కింద చేపట్టిన ‘పశుసంజీవని’ కార్యక్రమాన్ని గోపాలమిత్రల ద్వారా అమలు చేస్తున్నామన్నారు.

  • Published By: veegamteam ,Published On : January 24, 2019 / 06:40 AM IST
ఆ జిల్లాలో పశువులకూ ఆధార్‌ ఉండాల్సిందే

అనంతపురం జిల్లాలోని ప్రతి పశువుకూ ఆధార్‌కార్డు మాదిరి ఒక నంబరు కేటాయించి ట్యాగ్‌ చేస్తామని డిస్ట్రిక్‌ లైవ్‌స్టాక్‌ డెవలప్‌మెంట్‌ ఏజెన్సీ (డీఎల్‌డీఏ) ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (ఈఓ) డాక్టర్‌ ఎన్‌.తిరుపాలరెడ్డి తెలిపారు. ఇన్‌ఫర్మేషన్‌ నెట్‌వర్క్‌ ఫర్‌ ఎనిమల్‌ ప్రొడక్టివిటీ అండ్‌ హెల్త్‌ (ఇనాఫ్‌) కింద చేపట్టిన ‘పశుసంజీవని’ కార్యక్రమాన్ని గోపాలమిత్రల ద్వారా అమలు చేస్తున్నామన్నారు.

అనంతపురం జిల్లాలోని ప్రతి పశువుకూ ఆధార్‌కార్డు మాదిరి ఒక నంబరు కేటాయించి ట్యాగ్‌ చేస్తామని డిస్ట్రిక్‌ లైవ్‌స్టాక్‌ డెవలప్‌మెంట్‌ ఏజెన్సీ (డీఎల్‌డీఏ) ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (ఈఓ) డాక్టర్‌ ఎన్‌.తిరుపాలరెడ్డి తెలిపారు. ఇన్‌ఫర్మేషన్‌ నెట్‌వర్క్‌ ఫర్‌ ఎనిమల్‌ ప్రొడక్టివిటీ అండ్‌ హెల్త్‌ (ఇనాఫ్‌) కింద చేపట్టిన ‘పశుసంజీవని’ కార్యక్రమాన్ని గోపాలమిత్రల ద్వారా అమలు చేస్తున్నామన్నారు. దీంతో పాటు వాటి ఆరోగ్యం, వైద్య చికిత్సలు, ఎలాంటి టీకాలు ఇవ్వాలో తెలుస్తుందన్నారు. అందువల్ల రైతులు మాకు సహకరించాలని సూచించారు.  
రానున్న మార్చి చివరి నాటికి  జిల్లాలోని ఆవులు, గేదెలకు ఆధార్‌ కేటాయించే కార్యక్రమం పూర్తి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని తిరుపాలరెడ్డి తెలిపారు. 
యూనిక్‌ నంబర్‌ ఎందుకంటే:
గోపాలమిత్రల పరిధిలో ఉన్న ఆవులు, గేదెలను గుర్తించి వాటికి యూనిక్‌ నంబరు ట్యాగ్‌ తగిలిస్తారు. అలాగే పశువుల ఆరోగ్య వివరాలతో కూడిన డేటా ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేస్తారు. ఇందులో పశువులకు ఇచ్చే మేత వివరాలు, టీకాలు, వైద్య చికిత్సలు, పశువులను అమ్మినా, కొన్నా వాటి వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు. 
గోపాలమిత్రలకు అలవెన్సులు:
మార్చిలోగా లక్ష్యం సాధించాలని గోపాలమిత్రలకు అలవెన్సులు ప్రకటించాము. గోపాలమిత్రలు కూడా బాధ్యతగా మార్చికి వంద శాతం లక్ష్యం సాధించడానికి చర్యలు తీసుకోవాలి.  రైతులు పశుసంపదకు సంబంధించి సరైన వివరాలు ఇచ్చి గోపాలమిత్రలకు సహకరించాలని తిరుపాలరెడ్డి కోరారు. ప్రస్తుత 2018–19 ఆర్థిక సంవత్సరంలో 2.60 లక్షల పశువులకు కృత్రిమ గర్భోత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా… డిసెంబర్‌ నెలాఖరుకు 1.95 లక్షలు పూర్తయిందన్నారు. అలాగే 65,400 దూడలకు లేగ దూడల సంరక్షణ పథకం అమలు చేస్తున్నామనీ, గోపాలమిత్రలు, సూపర్‌వైజర్లను సంప్రదించి కృత్రిమ గర్భోత్పత్తి, లేగదూడల సంరక్షణ కార్యక్రమాలకు రైతులు ఉపయోగించుకోవాలని కోరారు.