పవన్‌కు మతిమరుపు అన్నీ మర్చిపోతారు: మంత్రి తీవ్ర విమర్శలు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తీవ్ర విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్ కు మతిమరుపు..ఆయన మాట్లాడిన మాటల్ని ఆయనే మరచిపోతారని ఎద్దేవా చేశారు. ఎన్నికలకు ముందు పవన్ పర్యటించిన సందర్భంగా ఆయన ఎక్కడకు వెళితే అక్కడే రాజధాని అంటూ వ్యాఖ్యానించారని ఇప్పుడు ఆయన ఆ మాటల్ని మరచిపోయి రైతులు..అన్యాయం అంటూ మాట్లాడుతున్నారంటూ ఎద్దేవా చేశారు.
అందుకే ప్రజలు ఎన్నికల్లో పవన్ ను తిరస్కరించారని విమర్శిచారు. రాజధానిపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణలు రాద్ధాంతం చేస్తున్నారనీ..రాజకీయం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఏ పార్టీ రాజకీయాలు చేసినా..ఎన్ని కుట్రలు చేసినా సీఎం జగన్ భయపడే వ్యక్తికాదనీ మూడు రాజధానులు జరిగితీరుతాయని మంత్రి స్పష్టంచేశారు. రాష్ట్రంలో ప్రతీ ఒక్క ప్రాంతం అభివృద్ధి చెందాని అందరికీ న్యాయం జరగాలనే లక్ష్యంతో జగన్ పాలన చేస్తున్నారని..సీఎం లక్ష్యం నెరవేరుతుందనీ..దానికి తమ వంతుగా కృషి చేస్తామని మంత్రి అన్నారు.