అమ్మతనానికి మచ్చ: ఏడేళ్ల కొడుకుని గొంతునులిమి చంపిన తల్లి..

  • Published By: veegamteam ,Published On : December 23, 2019 / 07:23 AM IST
అమ్మతనానికి మచ్చ: ఏడేళ్ల కొడుకుని గొంతునులిమి చంపిన తల్లి..

Updated On : December 23, 2019 / 7:23 AM IST

రంగారెడ్డి  రాజేంద్రనగర్ లో దారుణం చోటు చేసుకుంది. ఏడు సంవత్సరాల ముక్కుపచ్చలారని పిల్లాడు అంజాద్ ని గొంతు నులిమి చంపేశారు. కన్నతల్లే కుమారుడిని దారుణంగా హతమార్చినట్టుగా తెలుస్తోంది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఏడేళ్ల బాలుడు అంజాద్‌ నిద్రపోతుండగా కన్నతల్లే గొంతు నులిమి హత్య చేసింది.కసాయి తల్లిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. నవ్వు తల్లివేనా? అసలు మనిషివేనా అంటూ ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.  

ఈ దారుణంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. తల్లిని ప్రశ్నిస్తున్నారు. ఈ హత్య వెనుక ఇంకా ఎవరి హస్తమైనా ఉందా? లేదా తల్లే చంపిందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.