బైక్‌ను ఢీకొట్టిన లారీ : తల్లి, కొడుకు మృతి
మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ బైక్‌ను ఢీకొట్టడంతో తల్లి, కుమారుడు మృతి చెందారు.

మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ బైక్‌ను ఢీకొట్టడంతో తల్లి, కుమారుడు మృతి చెందారు.
మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ బైక్‌ను ఢీకొట్టడంతో తల్లి, కుమారుడు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. అశోక్, అనిత దంపతులు.. తమ కుమారుడు దీక్షిత్ ను తీసుకొని బైక్ పై చిన్న శంకరంపేట గ్రామానికి వెళ్తున్నారు. మార్గంమధ్యలో శివంపేట్ పోలీస్ స్టేషన్ సమీపంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ బలంగా ఢీ కొట్టడంతో బైక్‌పైనున్న తల్లి అనిత, కుమారుడు దీక్షిత్ అక్కడికక్కడే మృతి చెందారు.
బైక్ నడుపుతున్న అశోక్‌కు బలంగా గాయాలయ్యాయి. వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. కాగా, వారు సంగారెడ్డి జిల్లాలోని హత్నూర్ మండలం సాదుల నగర్ గ్రామానికి చెందిన వారని తెలిసింది. ఈ వార్త తెలియడంతో, బంధువులు, గ్రామస్తులు కన్నీటి పర్యంతమయ్యారు. గ్రామంలో విషాదం ఛాయలు అలుముకున్నాయి.