తెలంగాణలో ఫస్ట్ : డ్రంక్ అండ్ డ్రైవ్..రూ. 10 వేలు ఫైన్

కొత్త మోటార్ వెహికల్ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత వాహనదారుల గుండెలు గుభేల్ మంటున్నాయి. ట్రాఫిక్ పోలీసులు విధిస్తున్న చలాన్లతో జేబులకు భారీగా చిల్లుమంటున్నాయి. తాజాగా నల్గొండ జిల్లాలో మద్యం సేవించి వాహనం నడిపిన ఓ వ్యక్తికి రూ. 10 వేల జరిమాన విధించారు ట్రాఫిక్ పోలీసులు. కొత్త మోటార్ వెహికల్ చట్టం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో మొదటి వ్యక్తిగా గుర్తింపు పొందారు.
నల్గొండ జిల్లాలోని నకిరేకల్ గ్రామంలోని జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ దీనిని సున్నితంగా పరిశీలిస్తోందని..జైలు శిక్ష విధించకూడదని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే.. జరిమాన చెల్లించకపోతే 15 రోజుల పాటు జైలు శిక్ష పడుతుందని కోర్టు వెల్లడించింది.
శుక్రవారం మద్యం తాగిన వ్యక్తి తనిఖీల్లో పట్టుబడడం జరిగిందని, 172/100 ఎంజీగా తేలిందని పోలీసులు తెలిపారు. సెప్టెంబర్ 09వ తేదీ సోమవారం కోర్టు ఎదుట ప్రవేశ పెట్టడం జరిగిందన్నారు. ఎంవీ చట్టంలోని సెక్షన్ 185 (ఏ) ప్రకారం శిక్షర్హామైందని, దోషిగా కోర్టు తేల్చింది. హెల్మెట్ ధరించకపోవడం, మైనర్లు డ్రైవింగ్ చేయడం నిబంధనలు ఉల్లంఘనకు వస్తుందని, అయితే..దీనిపై జీవో రావాల్సిన అవసరం ఉందని నల్గొండ ఎస్పీ రంగనాథ్ అభిప్రాయం వ్యక్తం చేశారు.