జగన్‌కు షాక్.. జనసేనలోకి నాగబాబు

  • Published By: vamsi ,Published On : March 18, 2019 / 06:00 AM IST
జగన్‌కు షాక్.. జనసేనలోకి నాగబాబు

Updated On : March 18, 2019 / 6:00 AM IST

పశ్చిమ గోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. వైసీపీ టిక్కెట్‌పై వెనక్కు తగ్గేది లేదంటూ ఇప్పటివరకు చెప్పుకుంటూ వచ్చిన నియోజకవర్గ కన్వినర్ గుణ్ణం నాగబాబుకు చివరకు ఆ పార్టీ టిక్కెట్ దక్కలేదు. దీంతో కన్నీరు పెట్టుకున్న గుణ్ణం నాగబాబు ఆ పార్టీని వదిలేసేందుకు సిద్ధం అయ్యారు. పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి ఇప్పటికే రాజీనామా చేసినట్లు తెలుస్తుండగా నాగబాబు జనసేన గూటికి చేరుతున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో నాగబాబు జగన్‌కు షాక్ ఇస్తూ జనసేనలోకి వెళ్లేందుకు నాగబాబు సిద్ధం అయ్యినట్లు తెలుస్తుంది.
Read Also : మూడు జిల్లాల్లో జగన్ పర్యటన

ఈ క్రమంలో నాగబాబును జనసేన కార్యాలయానికి మాజీ మంత్రి హరిరామ జోగయ్య తీసుకుని వెళ్లారు. విజయవాడ పార్టీ కార్యాలయానికి వెళ్లిన  నాగబాబు పవన్ కల్యాణ్‌తో భేటి అనంతర సీటుపై స్పష్టత వస్తే పార్టీలో చేరాలని భావిస్తున్నారు. ఇదిలా ఉండగా డాక్టర్‌ బాబ్జి ఇటీవల వైసీపీలో చేరగా ఆయనకు వైసీపీ పాలకొల్లు సీటు కేటాయించింది. గతకొంతకాలంగా జనసేనకు రమ్మని నాగబాబుకు ఆహ్వానం పవన్ నుంచి వస్తుండడంతో ఆయనకు టిక్కెట్ వచ్చే అవకాశం కచ్చితంగా ఉందని అంటున్నారు.