ఫేస్‌బుక్ పేజీల్లో ఇకపై Like బటన్ కనిపించదు.. ఫాలో పేజీలన్నీ ఎలా వాడాలంటే?

ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ త్వరలో పేజీల అకౌంట్లలో లైక్ బటన్ తొలగిస్తోంది. సరికొత్తగా రీడైజన్ చేస్తోంది. ఫేస్ బుక్ పేజీలన్నీ కొత్తగా కనిపించనున్నాయి. ఆ పేజీల్లో ఇక లైక్ బటన్ కనిపించదు.. కేవలం ఫాలోవర్లు అని మాత్రమే కనిపించనుంది. పేజీల నిర్వాహణకు ఆయా అకౌంట్ దారులకు సొంత న్యూస్ ఫీడ్ అందిస్తోంది.
పేజీ నిర్వాహకులకు ఫేస్ బుక్ అకౌంట్ యజమానులకు మార్పుల్లో పెద్దగా తేడాలు ఉండవు. ఒక మార్పు నిర్వాహకులను సగటు వినియోగదారులను ప్రభావితం చేస్తుంది. లైక్ బటన్ తొలగించే యోచనలో ఉంది. వినియోగదారులు ఒక పేజీని ఫాలో కావొచ్చు. కానీ, మీకు ఇకపై లైక్ అనే బటన్ కనిపించదు. లైక్ బటన్ తొలగించడానికి కారణం ఏమిటంటే.. లైక్ బటన్, ఫాలో బటన్ మధ్య గందరగోళాన్ని తొలగించడానికేనంటూ స్పష్టం చేసింది.
ప్రస్తుతం, ఫేస్‌బుక్ యూజర్లు ఒక పేజీని లైక్ చేయొచ్చు. కానీ, దానిని ఫాలో చేయలేరు. అంటే ఆ లైక్ కౌంట్‌లో కనిపిస్తారు. కానీ, న్యూస్ ఫీడ్‌లో ఏ పోస్ట్‌లను చూడలేరని గుర్తించాలి. న్యూస్ ఫీడ్‌లోని పేజీ పోస్ట్‌లను చూడాలంటే తప్పక ఫాలో చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ టెస్టు పేజ్ యజమానులు, సాధారణ వినియోగదారుల నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్ ఫలితమని అంటోంది. ఫేస్ బుక్ Instagram కూడా ఇదే తరహా బటన్‌ను ఉపయోగిస్తుంది.
పేజీ నిర్వాహకులకు న్యూస్ ఫీడ్‌కు యాక్సస్ ఉంటుంది. వ్యాపారాలు, పబ్లిక్ వ్యక్తులను వారి వ్యక్తిగత ప్రొఫైల్‌కు బదులుగా వారి పేజీగా ఇంటరాక్ట్ చేయడానికి అనుమతిస్తుంది. పేజీలోని కామెంట్లు, పోస్ట్‌లకు పరిమితం చేస్తోంది.
పేజీ వార్తల ఫీడ్‌తో, పేజీ అకౌంట్ ఇతరుల పోస్ట్‌లను లైక్ చేయొచ్చు. కామెంట్లు చేయొచ్చు. ఈ మార్పు పేజీలలో డిబేట్లలో పాల్గొనడానికి అనుమతిస్తుంది. ఈ సరికొత్త ఫీచర్లు ఎప్పుడు పూర్తి స్థాయి యాప్ లోకి అందుబాటులోకి వస్తాయనేది ఫేస్ బుక్ రివీల్ చేయలేదు.