గుండెనొప్పితో చనిపోయాడు. కరోనా అనుకుని ఎవరూ దగ్గరకు వెళ్లలేదు.

కరోనా పాజిటివ్ కేసు బయట పడిన కరీంనగర్లో పండుగపూట విషాదం చోటు చేసుకుంది. గుండె పోటుతో ఒక వ్యక్తి రోడ్డుపై కన్నుమూశాడు. కరోనా వైరస్ భయంతో స్ధానికులు మృతదేహం వద్దకు రావటానికి భయపడ్డారు. కశ్మీర్ గడ్డ వద్ద ఉన్న రైతు బజారులో కూరగాయల కోసం ఒక వ్యక్తి వచ్చాడు. ఈ లోగా ఆ వ్యక్తికి గుండెపోటు వచ్చి మరణించాడు.
మృతదేహాం వద్దకు వెళ్లటానికి భయపడిన స్ధానికులు పోలీసులకు సమచారం ఇచ్చారు. ఘటనాస్ధలానికి చేరుకున్న అధికారులు మృతదేహాన్ని తరలించేందుకు ఏర్పాటు చేశారు. ఇటీవల ఇండోనేషియాకు చెందిన వారు కరీంనగర్ లో సంచరించటం….కరోనా పాజిటివ్ నమోదు కావటంతో ప్రజలు భయాందోళనలో ఉన్నారు.
See Also | అందరూ కరోనా పేషెంట్లులా ప్రవర్తించండి: న్యూజిలాండ్ ప్రధాని