అగ్రిగోల్డ్‌పై అసెంబ్లీలో ఎందుకు మాట్లాడలేదు : జగన్‌కు పవన్ క్వశ్చన్

విజయనగరం : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం ముమ్మరం చేశారు. టీడీపీ, వైసీపీలకు ధీటుగా ప్రచారం చేస్తున్నారు. ప్రత్యర్థులపై మాటల తూటాలతో

  • Published By: veegamteam ,Published On : April 5, 2019 / 09:30 AM IST
అగ్రిగోల్డ్‌పై అసెంబ్లీలో ఎందుకు మాట్లాడలేదు : జగన్‌కు పవన్ క్వశ్చన్

Updated On : April 5, 2019 / 9:30 AM IST

విజయనగరం : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం ముమ్మరం చేశారు. టీడీపీ, వైసీపీలకు ధీటుగా ప్రచారం చేస్తున్నారు. ప్రత్యర్థులపై మాటల తూటాలతో

విజయనగరం : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం ముమ్మరం చేశారు. టీడీపీ, వైసీపీలకు ధీటుగా ప్రచారం చేస్తున్నారు. ప్రత్యర్థులపై మాటల తూటాలతో విరుచుకుపడుతున్నారు. విజయనగరంలో వైసీపీ ఎన్నికల ప్రచారంలో పవన్ మాట్లాడారు. వైసీపీ చీఫ్ జగన్ పై విమర్శలు చేశారు. జగన్ కు ప్రజా సమస్యలు పట్టవు అని పవన్ అన్నారు. అగ్రిగోల్డ్ అంశంపై అసెంబ్లీలో ఎందుకు మాట్లాడలేదని జగన్ ను పవన్ ప్రశ్నించారు. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చెయ్యాలనే చిత్తశుద్ధి జగన్ కు లేదన్నారు. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేసే బాధ్యత తనదే అని పవన్ హామీ ఇచ్చారు.
Read Also : బ్రాహ్మణి స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేస్తా జగన్ హామీ

ప్రస్తుత రాజకీయాలు కుటుంబ నాయకత్వం నుంచి బయటపడాలనుకుంటున్నా అని పవన్ చెప్పారు. కొత్త రాజకీయ వ్యవస్థకు నాంది పలకాలనుకుంటున్నా అందుకే రాజకీయాల్లోకి వచ్చాను అని పవన్ తెలిపారు. విజయనగరం జిల్లాలో ఉద్యోగాలు రావాలంటే మూడు జూట్ మిల్లులు తెరవాలన్నారు. వైసీపీ నేత బొత్స సత్యనారాయణ మాత్రం పరిశ్రమలు రాకుండా అడ్డుకుంటున్నారని, పరిశ్రమలు పెట్టాలంటే బొత్స సత్యనారాయణకు కమీషన్లు ఇవ్వాలని పవన్ ఆరోపించారు. జనసేన అధికారంలోకి వస్తే బాధ్యతాయుతమైన ప్రభుత్వం ఏర్పాటు చేస్తామన్నారు. టీడీపీ, వైసీపీలా కాకుండా ప్రజలకు మంచి పాలన అందిస్తామన్నారు.
Read Also : పట్టుబడుతున్న కట్టలు : బంజారాహిల్స్ లో మూడున్నర కోట్లు