రాష్ట్రంలో మతమార్పిడిలు జరుగుతుంటే జగన్ సర్కార్ ఏం చేస్తుంది- పవన్ కళ్యాణ్

  • Published By: vamsi ,Published On : December 4, 2019 / 08:28 AM IST
రాష్ట్రంలో మతమార్పిడిలు జరుగుతుంటే జగన్ సర్కార్ ఏం చేస్తుంది- పవన్ కళ్యాణ్

Updated On : December 4, 2019 / 8:28 AM IST

వైసీపీ వాళ్లు తనకు చెతులెత్తి దండం పెట్టాలని, ప్రధాని దగ్గరకి, చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్లి ముగ్గురం కలిసి పోటీ చేసి ఉంటే ఇప్పుడు అవాక్కులు చవాక్కులు పేలుతున్న నాయకులు పరిస్థితి ఏంటో తెలుసుకోవాలని అన్నారు పవన్ కళ్యాణ్. స్పెషల్ స్టేటస్ కోసం మాత్రమే బీజేపీతో విభేదించానని, గెలవాలని మాత్రమే అనుకుంటే టీడీపీతో కలిసి పోటీ చేసేవాడిని కదా? అని ప్రశ్నించారు. వైసీపీ నాయకులు పొత్తు కోసం కబురు పంపితే ఎటువంటి సమాధానం చెప్పానో వాళ్లకే తెలుసు అని అన్నారు. కుహానా లౌకిక వాదుల గురించి భయపడేది లేదన్నారు.

ఏపీలో మతమార్పిడీలపై జగన్ సర్కార్‌ను తీవ్రస్థాయిలో తప్పుబట్టారు పవన్ కళ్యాణ్. మతమార్పిడులు జరుగుతుంటే.. కనిపించట్లేదా? అని మండిపడ్డారు. బెజవాడ దుర్గమ్మ గుడి ఎదురుగా.. పుష్కర్ ఘాట్‌లో సామూహిక మతమార్పిడీలు జరుగుతుంటే ఏం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ వర్గానికి సంబంధించి 42మంది మతాన్ని మార్చుకుంటుంటే సీఎంకు కనపడట్లేదా అన్నారు.

ఎవరి ధైర్యంతో చేస్తున్నారన్నారు. ‘‘దేవాదాయ శాఖ ఏం చేస్తోంది? హిందూ ధర్మాన్ని, మతాన్ని పరిరక్షించాల్సిన అధికారులు, ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారు? అన్నిటికీ సిద్ధమయ్యే మాట్లాడుతున్నా… ఎవరి అండ చూసుకుని ఈ పనులు చేస్తున్నారు? మిగిలిన పార్టీల్లోని హిందూ ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారు? హిందూ ధర్మానికి దెబ్బ తగిలితే ఎందుకు మాట్లాడరు? ఇది రాజ్యాంగ విరుద్ధం కాదా? సూడో సెక్యులరిజంపై మౌనంగా కూర్చుంటారా? ఓట్లు పోతాయనా?’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
.
ఇదే సమయంలో బీజేపీకి తాను దూరంగా లేనని, కలిసే ఉన్నానని స్పష్టం చేశారు. వైసీపీకి అమిత్ షా అంటే భయం.. కానీ నాకు షా అంటే గౌరవం.. అని అన్నారు. తానెప్పుడూ బీజేపీకి దూరంగా లేనని, హోదా విషయంలో సిద్ధాంతపరంగా విబేధించినట్లు చెప్పారు. దక్షిణాదిలో దేశానికి రెండో రాజధాని ఉండాలని అంబేద్కర్ అన్నారని’ గుర్తుచేశారు. ఇక టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలను విమర్శించడంలోనే ప్రభుత్వం సమయం వృధా అవుతుందని విమర్శించారు పవన్ కళ్యాణ్.