చంద్రబాబు ఎఫెక్ట్: పవన్ కళ్యాణ్ టూర్ రద్దు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శ్రీకాకుళం పర్యటన రద్దైంది. నేడు(30 మార్చి 2019) శ్రీకాకుళం జిల్లాలో పవన్ కళ్యాణ్ సభ నిర్వహించ తలపెట్టిన ఎన్నికల సమర శంకారావం సభకు పర్మిషన్ నిరాకరించిన కారణంగా పవన్ కళ్యాణ్ టూర్‌ను రద్దు చేసుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు టూర్ ఉన్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ టూర్‌కు పర్మిషన్ ఇవ్వలేదని చెబుతున్నారు.
Read Also : బాబు సీఎం.. ఉద్యోగాలు గోవిందా – జగన్
పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ విషయమై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే జనసేన అధినేత పర్యటన కోసం జనసైనికులు భారీ ఏర్పాట్లు చేసుకోగా పోలీసులు వ్యవహారిస్తున్న తీరు సరికాదని, ఇదేనా ప్రజాస్వామ్యం అని ప్రశ్నిస్తున్నారు.
పవన్ కళ్యాణ్ శ్రీకాకుళం జిల్లాలోని సోంపేట, పలాస, కాశీబుగ్గ బస్టాండ్, టెక్కలి, పాతపట్నంలో పర్యటించాలని షెడ్యూల్ ఫిక్స్ చేసుకున్నారు. అయితే సడెన్‌గా పవన్ పర్యటన రద్దవడంతో అభిమానులు తమ బాధను వ్యక్తం చేస్తున్నారు. దీంతో పవన్ కళ్యాణ్ గాజువాకలోని పలుచోట్ల ప్రచారం చేసుకోవాలని నిర్ణయాంచుకున్నారు.
ఇక ఇదే రోజు శ్రీకాకుళం జిల్లాలో చంద్రబాబు పలుచోట్ల ఎన్నికల పర్యటనకు శ్రీకారం చుట్టారు. ఇచ్ఛాపురం, నరసన్నపేట. రాజాం, ఎచ్చెర్ల, శ్రీకాకుళం నియోజకవర్గాల్లో పర్యటించనున్న చంద్రబాబు.. ఉదయం నుంచి రాత్రి వరకు ప్రచార సభలు నిర్వహించనున్నారు.
Read Also : ఢిల్లీ గులాములు కావాలా.. గులాబీలు కావాలా – KTR