బిగ్ బ్రేకింగ్ : వైసీపీ ఎమ్మెల్యే హత్యకు కుట్ర : విశాఖలో సుపారీ గ్యాంగ్ అరెస్ట్

విశాఖలో సుపారీ గ్యాంగ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.శ్రీకాకుళానికి చెందిన వైసీపీ నేత చిరంజీవిని హత్య చేసేందుకు సుపారీ తీసుకున్న గ్యాంగ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే చిరంజీవులుని హత్య చేసేందుకు రౌడీ షీటర్ కన్నబాబు రూ.4 లక్షలు అడ్వాన్స్ తీసుకున్నాడు. అనంతరం ఎమ్మెల్యేను చంపేందుకు రెక్కీ నిర్వహించాడు. కన్నబాబుకు పలాసకు చెందిన మరో రౌడీ షీటర్ పరమేశ్ సహకారం అందించాడు. ఈ విషయం తెలిసిన పోలీసులు ఈ సుపారీ గ్యాంగ్ పై నిఘా పెట్టి..ముగ్గురు రౌడీ షీటర్లతో సహా మొత్తం తొమ్మిది మందిని అరెస్ట్ చేశారు.
మొత్తం తొమ్మిదిమందిని అదుపులోకి తీసుకున్న పోలీస్ అధికారులు వారిని విచారిస్తున్నారు. అన్ని వివరాలు సేకరిస్తున్నారు. అరెస్ట్ చేసిన వీరి వద్ద నుంచి మూడు కత్తులతో పాటు పలు మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నారు. సుపారీ గ్యాంగ్ ఎమ్మెల్యేను హత్య చేసేందుకు మొత్తం రూ.10 లక్షలకు డీల్ కుదుర్చుకున్న సుపారీ గ్యాంగ్ రూ,4లక్షలు అడ్వాన్స్ తీసుకున్నారని పోలీసుల విచారణలో వెల్లడైంది.
ఈ గ్యాంగ్ కు సుపారీ ఎవరు ఇచ్చారు? వాళ్లు ఎవరు? ఎందుకు చంపాలనుకున్నారు? ఎమ్మెల్యే చిరంజీవులకు ఎవరు శతృవులున్నారు? అది రాజకీయంగానా లేక వ్యక్తిగతంగానా? అనే కోణంలో పోలీసులు క్షుణ్ణంగా వివరాలు రాబట్టేందుకు విచారణ కొనసాగిస్తున్నారు. వీరిని మరి కాసేపట్లో మీడియా ముందు ప్రవేశ పెట్టే అవకాశాలున్నాయి. ఎమ్మెల్యే హత్యకు కుట్ర విషయం బైట పడటంతో స్థానికంగా కలకలం రేపింది.